విశ్వంభర టీజర్ రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే..?

shami
మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ తర్వాత బాగా ఆలోచించి మరీ చేస్తున్న సినిమా విశ్వంభర. రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సైరా తప్ప చిరు అన్నె రొటీన్ ఫార్మెట్ సినిమాలు చేస్తున్నాడని విమర్శలు వచ్చాయి. వాటికి ఆన్సర్ ఇచ్చేందుకే విశ్వంభర చేస్తున్నాడు మెగాస్టార్. బింబిసార తో టాలెంట్ ప్రూవ్ చేసుకున్న వశిష్ట డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుంది.
విశ్వంభర సినిమా మొదలైనప్పుడే ఒక కాన్సెప్ట్ టీజర్ రెడీ చేశారు. అది చూసే ఈ సినిమా మామూలు సినిమాలా కాదని అనుకున్నారు. ఇక ఇప్పుడు సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారట. విశ్వంభర సినిమా గురిచి కొంత క్లూ ఇస్తూ ఈ టీజర్ రాబోతుంది. ఈ టీజర్ ని చిరు బర్త్ డే రోజు అనగా ఆగష్టు 22న రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. చిరంజీవి బర్త్ డే అంటే మెగా ఫ్యాన్స్ కి అదో పండుగ అన్నట్టే లెక్క.
ఈసారి విశ్వంభర టీజర్ తో దాన్ని రెట్టింపు చేసుకోవాలని చూస్తున్నారు. చిరంజీవి కూడా విశ్వంభర సినిమా మీద చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది. చిరు విశ్వంభర సినిమా విషయంలో ప్రతి విషయాన్ని చాలా ఫోకస్ గా చూస్తున్నారని తెలుస్తుంది. సినిమాను 2025 జనవరి 10న రిలీజ్ లాక్ చేశారు. అప్పటి కల్లా సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ త్రిష తెలుగులో నటిస్తున్న సినిమా ఇదే. త్రిష మాత్రమే కాదు మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్ లాంటి భామలు కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేస్తుండగా చిరంజీవి మాస్ కంబ్యాక్ మూవీగా ఇది రికార్డులు సృష్టిస్తుందని మెగా ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: