ఇండియన్ 3 ఎలాంటి డౌట్లు అక్కర్లేదు..!

shami
కమల్ హాసన్ శంకర్ ఎప్పుడో 28 ఏళ్ల క్రితం చేసిన సినిమా ఇండియన్ అదే తెలుగులో భారతీయుడుగా రిలీజైంది. అప్పట్లో రిలీజైన ప్రతి చోట సూపర్ హిట్ అనిపించుకుంది ఈ సినిమా. కమల్ హాసన్ నటన, శంకర్ డైరెక్షన్ ఇవి రెండు సినిమాను నెక్స్ట్ లెవెల్ లో ఉంచాయి. ఐతే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ సినిమాకు సీక్వెల్ చేశారు. ఇండియన్ 2 అంటూ ఇటీవల వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. సినిమా చూసిన ఆడియన్స్ అంతా అసలు ఈ సీక్వెల్ తీయకుండా ఉంటే బాగుండేదని అన్నారు. కమల్ పడిన కష్టమంతా వృధా అని అన్నారు.
ఐతే ఇండియన్ 2 ఒకటి కాదు రెండు భాగాలుగా చేశారు. ఇండియన్ 3 ని కూడా పూర్తి చేశారు. జస్ట్ అది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఒక్కటి పెండింగ్ లో ఉంది. ఐతే ఇండియన్ 2 రిజల్ట్ చూశాక ఇండియన్ 3 ని ఆపేస్తారని. అది రిలీజ్ చేయరని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. ఐతే చిత్ర యూనిట్ క్లోజ్ సోర్స్ నుంచి వస్తున్న వార్త ఏంటంటే ఇండియన్ 3 అనుకున్న టైం కు రిలీజ్ చేస్తారని అంటున్నారు.
ఇండియన్ 3 సినిమా షూటింగ్ మొత్తం పూర్తైంది. జస్ట్ సినిమా ఎడిటింగ్ చేయాల్సి ఉంది. 2025 సమ్మర్ లో ఇండియన్ 3 ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇండియన్ 2 చివర్లో ఇండియన్ 3 ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆడియన్స్ అంతా ఆ ట్రైలర్ చూసి వావ్ అనేశారు. సో ఇండియన్ 3 కథ కొతగా ఉండబోతుంది. కచ్చితంగా ఇండియన్ 2 కన్నా బెటర్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పొచు. ఫ్లాప్ అయిన సినిమాకు మరో భాగం చూస్తారా అన్న డౌట్ ఉన్నా సినిమా బాగుంటే తప్పకుండా చూస్తారని మేకర్స్ నమ్ముతున్నారు. ఇండియన్ 3 సినిమా 2025 సమ్మర్ రిలీజ్ అంటున్నారు. ఒక మంచి డేట్ చూసి రిలీజ్ అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. ఇండియన్ 3 లో కాజల్ అగర్వాల్ నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: