డిస్ట్రబెన్స్ ఉందని ఒప్పుకున్నట్టేగా..?

shami
మెగా ఫ్యామిలీ అల్లు కుటుంబం ఈ రెండు ఫ్యమైలీల మధ్య ఎప్పుడు ఏదో ఒక ఇష్యూస్ ఫ్యాన్స్ లో చర్చలకు వస్తుంటాయి. అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి ప్రచారం చేయడం మెగా ఫ్యామిలీకి నచ్చలేదు. ఆ టైం లోనే మెగా బ్రదర్ నాగ బాబు మనవాడు పరాయి వాడు కామెంట్ వైరల్ అయ్యింది. ఐతే ఈ ఇష్యూస్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీని గురించి మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఐతే వీటిపై ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదు. ఫైనల్ గా అల్లు అర్జున్ స్నేహితుడు నిర్మాత బన్నీ వాసు ఈ విషయంపై నోరు విప్పారు.
మెగా అల్లు కుటుంబాల మధ్య ఎప్పుడు ఏదో ఒక చిన్న చిన్న ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. అది సార్ట్ అవుట్ అయ్యే రోజు కోసం నేను ఎదురుచూస్తున్నానని అన్నారు. అంటే బన్నీ వాసు కవర్ చేయాలని చూసినా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య దూరం నిజమే అన్నది అర్ధమైంది. ఇదే క్రమంలో పుష్ప 2 విషయంలో కూడా అల్లు అర్జున్ సుకుమార్ మధ్య గొడవలు అవుతున్నాయన్న దాని గురించి కూడా స్పందించారు.
అసలు అలాంటివి ఏమి లేవని.. వాళ్ల రిలేషన్ వేరు అని అన్నారు బన్నీ వాసు. ఐతే మీడియాలో వస్తున్న కథనాలు చూసి తాము నవ్వుకుంటామని అన్నారు. పుష్ప 2 గురించి ఏమో కానీ మెగా అల్లు మధ్య నెలకొన్న వార్ గురించి అయితే బన్నీ వాసు చెప్పకనే చెప్పేశాడు. ఒక మంచి తరుణం కోసం ఎదురుచూస్తున్నామని అన్నాడు. మరి ఆ టైం ఎప్పుడు వస్తుంది అన్నది చూడాలి. ఐతే ఈ మొత్తం ఇష్యూపై బన్నీ వాసు కాత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడని చెప్పొచ్చు. ఆయ్ సినిమా సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ వాసు మీడియాతో ఇంటరాక్ట్ అవ్వగా ఈ విషయాల మీద స్పందించారు. పుష్ప 2 కల్కి రికార్డులను కూడా బ్రేక్ చేస్తే మంచిదేగా అని అన్నారు బన్నీ వాసు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: