యంగ్ హీరో నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా చందూమొండేటి దర్శకత్వంలో నాగచైతన్య "తండేల్" సినిమా చేస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి లాంచ్ చేసిన సత్యం మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమాను మేకర్స్ వాయిదా వేశారు. అదే సమయంలో పాడ్ ఇండియా వంటి భారీ చిత్రాలు రిలీజ్ కావడంతో ఈ సినిమాను 2025 జనవరిలో అలా రిలీజ్ చేయాలని
అంతా చేర్చిస్తున్నారు. ఇక దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా చైతు రీసెంట్ గా నటించిన "ధూత" వెబ్ సిరీస్ అందరికీ తెలిసిందే. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ ఇప్పటికీ కూడా స్ట్రీమింగ్ అవుతూనే ఉంది. అభిమానుల దగ్గర నుంచి కూడా ఈ వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ అవార్డులకు పోటీ పడడం విశేషం. ప్రెస్టీజియస్ ఇండియన్ టెల్లి స్ట్రీమింగ్ అవార్డు అంతేకాకుండా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్ లలో ధూత వెబ్ సిరీస్ పలు విభాగాల్లో
నామినేట్ అయ్యింది. దాంతో మేకర్స్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా తాము చేసిన వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా అవార్డ్స్ నామినేషన్ నుండి కూడా మంచి గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ స్ట్రీమింగ్ థ్రిల్లర్ సిరీస్ ను విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు.టాలీవుడ్ హీరో, అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో, దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. ఇది అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించి, భారతదేశానికి తిరిగి రావడానికి ముందు దాదాపు రెండేళ్ల జైలు జీవితం గడిపిన రాజు యొక్క నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. అయితే సాయి పల్లవి రెండు అవార్డులను గెలుచుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భం గా తండేల్ చిత్ర యూనిట్ ఈ హ్యాపీ మూమెంట్ ను సెలబ్రేట్ చేయడం జరిగింది