మహేష్ అభిమానులకు బిగ్ షాక్ ఇవ్వడానికి రెడీ అయిన రాజమౌళి.. జక్కన్న ఇలా చేయడం కరెక్టేనా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఇకపోతే మహేష్ బాబు ఆఖరుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో శ్రీ లీల , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు.

ఇకపోతే మహేష్ , రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో నటించబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ స్టార్ట్ కాక ముందే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక చాలా రోజుల నుండి రాజమౌళి , మహేష్ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను చేస్తున్నాడు. ఇకపోతే ఆగస్టు 9 వ తేదీన మహేష్ పుట్టిన రోజు అనే విషయం మన అందరికీ తెలిసిందే. దానితో మహేష్ పుట్టిన రోజు సందర్భంగా రాజమౌళి , మహేష్ తో చేయబోయే సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ విడుదల చేసే అవకాశం ఉంది అని గత కొన్ని రోజులుగా ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇకపోతే రాజమౌళి , మహేష్ ఫ్యాన్స్ కు షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి , మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి అప్డేట్ లను విడుదల చేసే ఉద్దేశంలో లేనట్లు దానితో మహేష్ , రాజమౌళి కాంబో లో సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ కూడా ఆగస్టు 9 వ తేదీన మహేష్ బాబు పుట్టినరో జు సందర్భంగా విడుదల కాదు అని ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: