షాక్: టాలీవుడ్ స్టార్ హీరోని ఎవరు టచ్ చేయలేరు.. కృష్ణవంశీ హాట్ కామెంట్స్..!

Divya
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో డైరెక్టర్ కృష్ణవంశీ కూడా ఒకరు.. గతంలో ఎంతో మంది హీరోలను స్టార్ హీరోలుగా చేర్చిన ఘనత కృష్ణవంశీకే దక్కింది. విభిన్నమైన పాత్రలతో సినిమాలతో ప్రేక్షకులను ఎప్పుడు మెప్పిస్తూనే ఉంటారు కృష్ణవంశీ. కృష్ణవంశీ ఎవరో కాదు హీరోయిన్ రమ్యకృష్ణ భర్త.. కృష్ణవంశీ ఏ ఇంటర్వ్యూలోనైనా సరే టాలీవుడ్ స్టార్ హీరోల పైన ప్రశంసలు కురిపించడం కొత్తేమీ కాదు. అయితే టాలీవుడ్ లో ఒక హీరో అని ట్విట్టర్ వేదికగా ఒక ట్విట్ చేస్తూ పొగడ్తల వర్షం కురిపించారు. ఆ హీరో గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం.

బాలీవుడ్ వదిలేయండి ఏకంగా ఆ హీరో హాలీవుడ్ ని ఏలేస్తాడు అంటూ ఒక స్టార్ హీరో పైన చాలా నమ్మకం ఉంది అంటూ తెలియజేశారు. దీనికి ఆ హీరో ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు.. అసలు విషయంలోకి వెళ్తే కృష్ణవంశీ గతంలో తీసిన మురారి సినిమా రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా కృష్ణవంశీ ట్విట్టర్లో మహేష్ ఫ్యాన్స్ తో ముచ్చటించడం జరిగింది. ఇందులో ఒక అభిమాని మహేష్ తో మీరు మళ్ళీ సినిమా చేయగలరా అని కోరగా కృష్ణవంశీ అందుకు ఇలా సమాధానాన్ని తెలిపారు..

ఇప్పుడు మహేష్ రేంజ్ వేరు ఆయన రాజమౌళితో సినిమా చేస్తున్నారు కాబట్టి ఆ సినిమా తర్వాత మహేష్ బాబు హాలీవుడ్ రేంజ్ లోకి వెళ్ళిపోతాడు మహేష్ జేమ్స్ బాండ్ సినిమా తీయాలని.. అలాగే జేమ్స్ బాండ్ గా పేరుపొందిన డేనియల్ క్రేయిగ్ పని అయిపోయిందని.. త్వరలోనే తన స్థానాన్ని మహేష్ భర్తీ చేస్తాడని తెలిపారు. కృష్ణవంశీ మహేష్ని పొడగడం కొత్తేమీ కాదు గతంలో కూడా ఎన్నో సందర్భాలలో మహేష్ పైన తన మనసులో మాటని బయటపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మహేష్ బాబు బర్తడే ఆగస్టు 9న మురారి సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారు.. గతంలో కూడా మహేష్ నటించిన చాలా చిత్రాలు రిలీజ్ అయ్యి రికార్డు సృష్టించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: