'బర్త్ డే బాయ్' ఎలా ఉంది? ప్లస్&మైనస్ పాయింట్స్ ఇవే?

Purushottham Vinay

నేడు బర్త్ డే బాయ్ అనే చిన్న సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ ఏంటంటే అస్సలు టైమ్ వేస్ట్ చేయకపోవడం. ఈ సినిమా మొదలైన 10 నిమిషాలకే అసలు కథ మొదలవుతుంది. ఎక్కడా కూడా టైమ్ తీసుకోలేదు దర్శకుడు. చిన్న పాటతో కథను మొదలు పెట్టి.. నేరుగా అసలు కథలోకి వెళ్లిపోయాడు దర్శకుడు. మొదలవ్వడమే ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఓ పాట.. వెంటనే బర్త్ డే పార్టీ.. ఆ పార్టీలో కుర్రాళ్లు చేసే పిచ్చి పనులు ఇంకా స్నేహితుడితో ఆడుకోవడం.. తరువాత అతడు చనిపోవడం.. ఆ వెంటనే భరత్ కారెక్టర్ కథలోకి రావడం.. ఇలా ఎక్కడా గ్యాప్ ఇవ్వలేదు దర్శకుడు విస్కీ. కథ చాలా వేగంగా వెళ్లిపోతూనే ఉంటుంది. ముఖ్యంగా బర్త్ డే బాయ్ కు ఉన్న మరో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఈజీగా రిలేట్ అయ్యే కథ. ఈ మధ్య చాలా చోట్ల బర్త్ డే పార్టీల పేరుతో చేస్తున్న వికృత చేష్టలు మనం చాలానే చూస్తూనే ఉన్నాం కదా.. అదే ఈ ఈ మూవీలోనూ చూపించాడు దర్శకుడు విస్కీ. అక్కడే ఈ మూవీని చూడాలని ఆసక్తి పెరిగిపోతుంది.


ఫస్టాఫ్ అంతా కూడా చాలా ఆసక్తికారంగానే సాగుతుంది. కేవలం ఆరుగురు కారెక్టర్స్‌తోనే ను చాలా బాగా నడిపించాడు సినిమా దర్శకుడు విస్కీ. ఇంటర్వెల్ దాకా అసలు ఎక్కడా బోర్ కొట్టకుండా వెళ్లిపోతుంది. ముఖ్యంగా బాలు డెడ్ బాడీ చుట్టూ అల్లుకున్న డ్రామా బాగా వర్కవుట్ అయింది. రవికృష్ణ, సమీర్ మళ్లా కారెక్టర్స్ వచ్చిన తర్వాత కథ ఇంకా ఆసక్తికరంగా ముందుకెళ్లింది. ఇండియాలో ఉన్న వాళ్ల పేరెంట్స్‌తో మాట్లాడటం.. వాళ్లు పోన్ చేస్తుంటే ఏం చెప్పాలో తెలియక కంగారు పడుతుండటం.. ఇవన్నీ కూడా సినిమాలో చాలా బాగున్నాయి. సెకండాఫ్ కూడా ఇదే కథను కంటిన్యూ చేస్తాడు అనుకుంటున్న క్రమంలో .. ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చి కథను మరో మలుపు తిప్పాడు యువ దర్శకుడు విస్కీ. అక్కడి దాకా సినిమా పై ఉన్న ఇంప్రెషన్ కాస్త తగ్గుతుంది కానీ ఏమాత్రం బోర్ కొట్టదు.సెకండాఫ్ కథ కంటే ఎక్కువగా ఎమోషన్స్‌పై ఫోకస్ చేసాడు దర్శకుడు విస్కీ. అక్కడ కాస్త ల్యాగ్ సీన్స్ ఉంటాయి.అవే కొంచెం మైనస్. కానీ పెద్ద ఇంపాక్ట్ చూపించవు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ చాలా చాలా బాగున్నాయి. కొన్ని ట్విస్టులు కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: