దేవర సెకండ్ సింగిల్ రిలీజ్ కి కారణం అదేనా.. ఇలా అయితే కష్టమే అంటున్న అభిమానులు..?

Pulgam Srinivas
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ మూవీ తర్వాత అయిన కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాను మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ దర్శకుడు చాలా రోజుల క్రితమే ప్రకటించాడు. ఇకపోతే ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. ఈ మూవీ నుండి చాలా రోజుల క్రితమే ఫియర్ అంటూ సాగే ఒక పాటను మేకర్స్ విడుదల చేశారు. దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ సాంగ్ కి అనిరుద్ అందించిన సంగీతానికి కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన రెండవ సాంగ్ అప్పుడు విడుదల కాబోతుంది , ఇప్పుడు విడుదల కాబోతోంది అంటూ అనేక వార్తలు వస్తున్నాయి. కానీ మూవీ బృందం మాత్రం అందుకు సంబంధించిన అప్డేట్ ను ఇవ్వడం లేదు. తాజాగా ఈ మూవీ సెకండ్ సింగిల్ విడుదల ఆలస్యం కావడానికి అనిరుద్ కొంత కారణమా అనే ప్రశ్నలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అనిరుద్ గతంలో ఎన్నో మూవీలకు అద్భుతమైన మ్యూజిక్ ను అందించడంతో దేవర ఆల్బమ్ పై ప్రస్తుతానికి అద్భుతమైన రీతిలో అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: