మురారి : ఆ న్యూస్ తో అభిమానుల్లో అసంతృప్తి.. రీ రిలీజ్ ఉంది కానీ..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన మురారి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా 2001 వ సంవత్సరం ఫిబ్రవరి 17 వ తేదీన విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సలుడ్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ తో మహేష్ బాబు కు అద్భుతమైన గుర్తింపు కూడా దక్కింది.

ఇది ఇలా ఉంటే ఆ సమయంలో అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమాను తిరిగి మళ్ళీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాను ఈ సంవత్సరం మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9 వ తేదీన కొన్ని థియేటర్ లలో 4K వర్షన్ తో మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమా రీ రిలీజ్ అనౌన్స్మెంట్ రాగానే మహేష్ అభిమానులు ఎంతగానో ఆనంద పడ్డారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ రన్ టైమ్ కి సంబంధించిన ఓ అప్డేట్ బయటకు వచ్చింది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ మొదటి విడుదలలో దాదాపు 3 గంటల రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమాను రీ రిలీజ్ లో భాగంగా మాత్రం కేవలం 2 గంటల 42 నిమిషాల నిడివితో మాత్రమే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ నుండి ఈ 18 నిమిషాల నిడివి గల సన్నివేశాలని తీసివేసినట్లు సమాచారం అందుతుంది. అలా ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ప్రేక్షకుల ముందుకు 2 గంటల 42 నిమిషాలతోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ రన్ టైమ్ ను తగ్గించడంతో మహేష్ అభిమానులు కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: