గేమ్ చేంజర్ : రేపటి నుండి ఆ పనులు ప్రారంభం.. అక్కడ తేడా కొడితే మూవీ కథ క్లోజ్..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ కు సంబంధించిన షూటింగ్ పోర్షన్ కంప్లీట్ అయింది. ఈ విషయాన్ని ఈ మూవీ దర్శకుడు శంకర్ అధికారికంగా ధ్రువీకరించాడు. అలాగే ఈ మూవీ కి సంబంధించిన మరికొన్ని రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు దానిని కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేయనున్నట్లు కూడా శంకర్ తెలియజేశారు. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రేపటి నుండి ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా శంకర్ , కమల్ హాసన్ హీరోగా భారతీయుడు 2 అనే సినిమాను తెరకెక్కించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి ఏ మాత్రం చెప్పుకోదగ్గ కలెక్షన్లు రావడం లేదు. ఇక ఈ సినిమా ఆల్మోస్ట్ భారీ అపజయాన్ని అందుకోవడం ఖాయంగా కనబడుతుంది. దానితో శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ మూవీ పై కూడా ప్రస్తుతం పెద్దగా బజ్ లేకుండా పోయింది. శంకర్ వరసగా అపజాయలను అందుకుంటున్నాడు.

గేమ్ చేంజర్ తో కూడా మరో అపజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయి అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. దానితో శంకర్ తన సత్తా ఏంటో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది కాబట్టి షూటింగ్ విషయంలో పెద్దగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమీ లేవు. ఇక మిగిలి ఉంది పోస్ట్ ప్రొడక్షన్. సినిమాను ఇది కూడా డిసైడ్ చేస్తుంది. ఇక్కడ కరెక్ట్ నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత రీ షూట్ చేసి కూడా సినిమాను కాపాడవచ్చు. మరి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో శంకర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు అనేదానిపై కూడా ఈ సినిమా రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: