ఫ్లాప్ టాక్ తో ఆ విషయంలో ఇండియాలో 3వ ప్లేస్ లో నిలిచిన "ఇండియన్ 2"..!

Pulgam Srinivas
దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా ఇండియన్ 2 అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా తమిళ్ లో ఇండియన్ 2 గాను హిందీ లో హిందుస్థానీ 2 గాను విడుదల అయింది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించగా ... లేక ప్రొడక్షన్స్ , రెడ్ గ్లాంట్ సంస్థల వారు సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించారు. సిద్ధార్థ్ , రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియ భవాని శంకర్ , సముద్ర ఖని , భాబి సింహ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

ఇకపోతే ఈ మూవీ భారీ అంచనాల నడుమ జూలై 12 వ తేదీన తమిళ్ , తెలుగు , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగెటివ్ టాక్ వచ్చింది. అయిన కూడా ఈ సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా 183.20 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలవగా , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం శర్మ 79.30 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది.

ఇక ఇండియన్ 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 58 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి 3 వ స్థానంలో నిలిచింది. ఇలా ఫ్లాప్ టాక్ తో కూడా ఈ మూవీ ఈ సంవత్సరం మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో 3 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: