రీ రిలీజ్ కు సిద్దమైన సూపర్ స్టార్ కల్ట్ క్లాసిక్ మూవీ..!!

murali krishna
టాలీవుడ్‌లో గ‌త కొంత‌కాలంగా రీ రిలీజ్‌ల ట్రెండ్ కొన‌సాగుతోంది. హీరోల పుట్టిన రోజు, ప్ర‌త్యేక‌మైన రోజుల‌ను పురస్క‌రించుకుని గ‌తంలో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన సినిమాల‌ను మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన తమ పేవరెట్ హీరోల చిత్రాలను మరోసారి థియేటర్స్ లో చూసేందుకు ఇష్టపడవుతున్నారు ఫ్యాన్స్. రీ రిలీజ్ అనే కాన్సెప్ట్ తో ఇప్పటికే విడుదలైన పలు సూపర్ హిట్ సినిమాలు రెండో సారి కూడా అదే క్రేజ్ తో బాక్సాఫీస్ ముందు సత్తా చూపించాయి.
తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ఓ క్రేజీ సినిమా రీ రిలీజ్‌కు సిద్ద‌మైంది.మహేష్ బాబు-సోనాలి బింద్రే కాంబోలో డైరెక్టర్ కృష్ణవంశీ 2001లో మురారి చిత్రాన్ని తెరకెక్కించారు. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మహేష్ నటన, పాటలు, ఫ్యామిలీ ఎమోషనల్ సీన్లు ఆడియన్స్‌ను ఫిదా చేశాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని "అలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేలు" పాట అయితే రెండు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ తెలుగు నాట పెళ్లి వేడుకల్లో వినిపిస్తూనే ఉంది.

సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బాబు సినిమా వస్తే చాలు థియేటర్ల నుంచి సోషల్ మీడియాలో వరకూ వీళ్లు చేసే పండగ మాములుగా ఉండదు. ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ మొదలైతే వీళ్లని ఆపడం కూడా అంతే కష్టం. అయితే తాజాగా మహేష్ బాబు పుట్టినరోజు నాడు 'మురారి' సినిమాను రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాకి వెరైటీ ప్రమోషన్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.ఇక మరికొంతమంది ఫ్యాన్స్ అయితే సినిమా రీరిలీజ్‌కి వేరే లెవల్లో ప్రమోషన్స్ కూడా చేసేస్తున్నారు. మొన్న కొంతమంది అభిమానులు "ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం" అంటూ ఏకంగా మురారి సినిమా రీరిలీజ్‌కి శుభలేఖ కూడా అచ్చు వేయించేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి..ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం మ‌హేశ్ బాబు ద‌ర్శ‌క దీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టించ‌నున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న‌ట్లుగా తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ను మొద‌లు పెట్టేందుకు చిత్ర బృందం సిద్ద‌మ‌వుతున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: