టాలీవుడ్‌ యాంకర్‌ కు బెదిరింపులు..ఇంటికి వచ్చి రేప్‌ చేస్తామంటూ?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్నారు. ఒకప్పుడు యాంకర్లు అంటే చాలా పద్ధతిగా ఉండేవారు. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. యాంకర్లు వారి అందాలను ఆరబోస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్లు అందాలను ఆరబోస్తూ.... గ్లామర్ షోలు చేసి ఫేమస్ అవుతూ ఉండేవారు. ఇప్పుడు యాంకర్లు కూడా అలానే చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో అనసూయ, రష్మీ, వర్షిని వంటి ఇంకా ఎంతోమంది యాంకర్లు ఉన్నారు. ఇప్పుడు వీరంతా కూడా హీరోయిన్లకు గట్టి పోటీనిర్ ఇస్తూ గ్లామర్ షో చేస్తున్నారు.

ఈ కోవలోనే ఇప్పుడు విష్ణుప్రియ కూడా చేరిపోయింది. తన నవ్వులతో ఒకప్పుడు ఫేమస్ అయినటువంటి విష్ణు ప్రియ.... ఆ తర్వాత యాంకర్ గా మారింది. ముఖ్యంగా సుడిగాలి సుదీర్ తో కలిసి పోవే పోరా షోలో యాంకర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఆ షోలో తన అందాలను చూపిస్తూ కుర్రకారును ఫిదా చేసింది. ఇక విష్ణుప్రియకి ఇప్పుడు యాంకర్ గా పెద్దగా అవకాశాలు రావడం లేదు. దీంతో ఈ భామ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తుంది.

అంతేకాకుండా పలు వెబ్ సిరీస్ లలోను నటిస్తోంది. ఇక ఈ బ్యూటీ రీసెంట్గా ఓ పాటలో తన అందాలను చూపిస్తూ అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాకుండా విష్ణు ప్రియ హై వోల్టేజ్ ఫోటోషూట్లు చేస్తూ అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఇక మరోసారి ఈ భామ తన గురించి మాట్లాడుకునేలా చేసింది. హాట్ ఫోటోషూట్స్ చేసిన విష్ణు ప్రియ.... తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ ఫోటోలు చూసిన చాలామంది షాక్ అవుతున్నారు. ఓ ప్రోడక్ట్ ప్రమోషన్ లో భాగంగా ఈ అమ్మడు రెచ్చిపోయి మరి ఫోటోషూట్ చేసిన తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇక విష్ణుప్రియ ఇలా హాట్ ఫోటోలను పోస్ట్ చేయడంతో నెటిజెన్స్ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారట. ఇంకోసారి ఇలాంటి హాట్ ఫోటోలు పెడితే నిన్ను రేప్ చేస్తామంటూ చాలా బ్యాడ్ గా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: