సుకుమార్ మీద కోపంతో ఆ పని చేసిన అల్లు అర్జున్..?

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి సోషల్ మీడియాలో తిరుగులేని ట్రాక్ రికార్డు ఉన్న సంగతి తెలిసిందే. బన్నీ కి సంబంధించి ఎటువంటి వార్త వచ్చినా గానీ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఏవో ఒక వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి.అదేవిధంగా ఇప్పుడు పుష్ప షూటింగ్ సమయంలో అల్లు అర్జున్సుకుమార్ మధ్య తలెత్తిన విభేదాల గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే వీళ్ళిద్దరి మధ్య జరిగిన మాజీ విభేదాల వల్ల అల్లు అర్జున్ తన గడ్డం మొత్తం క్లీన్ చేసుకున్నాడట. మూడు యూనిట్లతో షూటింగ్ చేయించాలని అల్లు అర్జున్ కోరితే.. సుకుమార్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. దీని కారణంగానే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అంటున్నారు. దీంతో సుకుమార్ ఎంత చెప్పినా వినకుండా బన్నీ గడ్డం చేయించాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే తాను ఎంత చెప్పినా వినకుండా బన్నీ గడ్డం చేయించాడని హర్ట్ అయిన సుకుమార్ అమెరికా వెకేషన్‌కి వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసిన బన్నీ కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బన్నీ కూడా తమ ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్‌కి పయణమయ్యాడని కొన్ని రూమర్స్ వస్తున్నాయి.పుష్ప: ది రైజ్‌’ సినిమా విషయంలోనూ ఇలానే జరిగిందనే విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి.

ఈ సినిమాను రిలీజ్‌కు ముందు రోజు వరకు కొన్ని మార్పులు, చేర్పులు చేశారట. ఈ నేపథ్యంలో సుకుమార్‌ ప్రచారం కోసం కూడా ఆయన ముందు రోజు వరకు రాలేదు. దీంతో అల్లు అర్జున్‌   , దేవిశ్రీప్రసాద్‌  , రష్మిక మందననే  ప్రచార బాధ్యతలు పోషించారు. ఈ సారి ఎలాగైనా డిసెంబరులో సినిమా తెచ్చేయాలంటే ఇలాంటి పరిస్థితే వస్తుంది అని అంటున్నారు నెటిజన్లు.
పెద్ద సినిమా అన్నాక వాయిదాలు సహజం. ఈ మాటను క్యాజువల్‌గా అనేస్తారు కానీ.. ఆ మాట అనడం వెనుక, ఆ పని జరగడం వెనుక చాలా ఇబ్బంది ఉంటుంది.ఇక అల్లు అర్జున్ గెడ్డం తీసేయడంతో ఈ సినిమా షూట్ ఇప్పట్లో స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. ఐకాన్ స్టార్ గెడ్డం పెరగాలంటే.. కనీసం 1 నెల పడుతుంది. ఆ తర్వాత ఈ సినిమా 1 నెల నుంచి నెలన్నర షూటింగ్ ఉంటుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌కు మరో నెల ఉంటుంది. ప్రమోషన్స్, తదితర కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఈ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది అనే వార్త చక్కర్లు కొడుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: