ఐ బొమ్మ.. కొత్త కొత్త సినిమాలు ఇక్కడ చూసేయొచ్చు!

Suma Kallamadi
ఏపీ, తెలంగాణలో క్రమక్రమంగా థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లి సినిమా చూడడం తగ్గుతూ వస్తోంది. ఎప్పుడైనా సరదాగా థియేటర్‌కు వెళ్లి సినిమా చూద్దామంటే భయపడే పరిస్ధితి నెలకొంది. ఒకప్పుడు సినిమా వినోదానికి మారుపేరుగా ఉండేది. ప్రస్తుతం అది ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. కుటుంబంతో పాటు ఎవరైనా సినిమాకు వెళ్తే ఖచ్చితంగా జేబుకు చిల్లు పడుతోంది. దీంతో వారాంతంలో ఫ్యామిలీతో సహా థియేటర్లకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. దీనికి ఓ కారణం ఉంది. టికెట్ రేట్లకు రెండు మూడు రెట్లు తినుబండారాల ధరలు ఉన్నాయి. క్యాంటీన్లలో తినుబండారాల రేట్లు చూస్తే గుండె గుభేల్‌మనే పరిస్థితి నెలకొంది.
పాప్ కార్న్ వంటివి బయట రూ.10 నుంచి రూ.20 ధరకు లభిస్తాయి. అదే పాప్ కార్న్ థియేటర్లలో తినాలంటే రూ180 నుంచి రూ.350 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. బయట రూ.20 ఉండే సమోసా ఇక్కడ రూ.80కి మించి ధర పలుకుతోంది. ఇలా ప్రతి తినుబండారాలు, కూల్ డ్రింక్స్ ధరలు భారీగా ఉంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వీటిని కంట్రోల్ చేయాల్సిన తూనికలు, కొలతల శాఖ ఎప్పుడో ఒకసారి తూతూమంత్రంగా తనిఖీలు చేసి వదిలేస్తోంది. చాలా మందికి ఇలాంటి శాఖ ఒకటి ఉందని తెలియదు. దీంతో థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు వెళ్లే వారు ఖచ్చితంగా రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
కరోనా సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో ప్రేక్షకులు ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. దీనిని అవకాశంగా మలుచుకున్న ఓటీటీ సంస్థలు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను భారీగా పెంచేశాయి. ప్రేక్షకుల నుంచి భారీగా పిండుకున్నాయి. దీంతో ప్రేక్షకులు థర్డ్ పార్టీ వెబ్‌సైట్లను ఆశ్రయించాల్సి వచ్చింది. క్రమంగా థియేటర్లు, ఓటీటీ సంస్థలను పక్కన పెట్టి థర్డ్ పార్టీ సంస్థల వైపు ప్రేక్షకులు అలవాటు పడ్డారు. ముఖ్యంగా చాలా మంది యువతను సినిమాలు ఎలా చూస్తున్నారని ప్రశ్న వేస్తే థియేటర్లు, ఓటీటీ సంస్థల పేర్లు చెప్పడం మానేశారు. వారికి ఐ బొమ్మ ఓ ప్రత్యామ్నాయంగా మారిపోయింది. ఓటీటీలలో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ఇక్కడ రూపాయి ఖర్చు పెట్టకుండానే ఫ్రీగా చూడొచ్చు. దీంతో కుటుంబంతో సహా ఐ బొమ్మ ఓపెన్ చేసి అంతా కొత్త సినిమాలు చూస్తున్నారు.
ప్రస్తుతం ఐ బొమ్మలో కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి వచ్చేశాయి. వాటిలో ఫ్యామిలీ స్టార్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ప్రసన్న వదనం, మహారాజా, హరోంహర, ఓం భీం బుష్, డీజే టిల్లు స్క్వేర్ వంటి సినిమాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవలే రిలీజ్ అయిన ప్రముఖ వెబ్ సిరీస్ మీర్జాపూర్ సీజన్ 2 కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఫ్రీగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసే అవకాశాన్ని ఐబొమ్మ కల్పిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: