ఆ విషయంలో నాని ఫ్యాన్స్ ను చూసి జలస్ ఫుల్ అవుతున్న ఇతర హీరోల అభిమానులు..?

MADDIBOINA AJAY KUMAR
నాచురల్ స్టార్ నాని ఎవరి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు . ఇక మొదట దర్శకుడు కావాలి అనుకున్న ఆయన ఆ తర్వాత అష్టా చమ్మా సినిమాలో అనుకోకుం డా హీరో పాత్ర దొరకడం , ఇక అందు లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టు కోవడం , ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్ కావడం తో ఈయనకు హీరోగా అవకాశాలు రావడం మొదలు అయింది . అందులో భాగంగా ఈయన కూడా ఆచితూచి కథలను ఎంచుకోవడం అలాగే తన నటనతో అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడం తో నాని తెలుగులో మంచి గుర్తింపు కలిగిన హీరో స్థాయికి వెళ్లిపోయాడు.

ఇకపోతే నాని ఎప్పుడు కూడా దర్శకుల కోసం వెయిట్ చేయకుండా మంచి కథ ఉంటే చాలు కొత్త వాళ్లతో అయినా సినిమా చేయడానికి , ఫ్లాప్ లలో ఉన్న వారితో అయినా సినిమాలు చేయడానికి రెడీగా ఉంటాడు. దానితో కెరియర్ మొదలు పెట్టినప్పటి నుండి నాని ఎప్పుడు కూడా గ్యాప్ లేకుండా సినిమాలో చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం నాని "సరిపోతా శనివారం" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. నాని ఈ మూవీ తర్వాత సుజిత్ , వేణు దర్శకత్వంలో మూవీలు చేయాలి అనుకున్నాడు. కానీ అనుకోకుండా ఈ మూవీలు ఆగిపోయాయి.

దానితో నాని ఖాళీగా ఉంటాడేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ నాని వెంటనే శైలేష్ కొలను దర్శకత్వంలో ఓ మూవీ , శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో మరో మూవీ ని వెంటనే ఓకే చేసుకున్నాడు. ఇక నాని ఇలా సినిమాలను ఓకే చేస్తూ వెళ్ళడంతో ఆయన అభిమానులు ఎంతో ఆనంద పడుతూ ఉంటే , ఇతర హీరోల అభిమానులు మాత్రం ఆయన అభిమానుల్ని చూసి జలస్ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: