మొదటి సినిమా విడుదల కాకుండా అనేక సినిమాలలో ఆఫర్లు కొట్టేసిన బ్యూటీస్ వీరే..?
కృతి శెట్టి : ఈ ముద్దుగుమ్మ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన అనే మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా విడుదలకు ముందే ఈ మూవీ నుండి విడుదల అయిన ప్రచార చిత్రాల ద్వారానే ఈమెకు మంచి గుర్తింపు లభించింది. దానితో ఈమెకు ఉప్పెన సినిమా విడుదల కాకముందే తెలుగు లో అనేక సినిమాలలో అవకాశాలు దక్కాయి.
భాగ్య శ్రీ బోర్స్ : ఈ నటి ప్రస్తుతం రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ తోనే ఈమె తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ సినిమా విడుదల కాకముందే ఈమెకు అనేక తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ హీరోగా రూపొందబోయే ఓ మూవీలోనూ , దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందబోయే ఓ మూవీలోను ఈమె హీరోయిన్ సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది.
జాన్వి కపూర్ : ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తోనే ఈమె తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ సినిమా విడుదల కాకముందే ఈ బ్యూటీ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోయిన్ గా ఒకే అయింది. అలాగే నాని , శ్రీకాంత్ ఓదెలా కాంబోలో రూపొందబోయే సినిమాలో కూడా ఈమెనే హీరోయిన్ గా ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి.