వావ్: ఎట్టకేలకు పెళ్లి తేదిని చెప్పేసిన కిరణ్ అబ్బవరం..!

Divya
టాలీవుడ్ యంగ్ హీరో టాలెంటెడ్ హీరోగా పేరుపొందిన కిరణ్ అబ్బవరం.. ఫ్లాప్ సక్సెస్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ రోజున తన పుట్టినరోజు కావడం చేత తన సినిమాలకు సంబంధించి అప్డేట్ల తో పాటు అభిమానులు కూడా కిరణ్ అబ్బ వరానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే కిరణ్ అబ్బవరం చేసుకోబోయే భార్య హీరోయిన్ రహస్య గోరఖ్ తాజాగా ఒక రొమాంటిక్ వీడియో ని సైతం షేర్ చేసి విష్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ వీడియోలో తన పెళ్లి డేట్ ని కూడా రివిల్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు. వీరిద్దరూ రాజా వారు రాణి వారు అనే సినిమాలో మాత్రమే నటించడం జరిగింది. అలా అంటి సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ మొదలై ఆ ప్రేమను వివాహం వరకు తీసుకువెళ్తున్నారు. ఈ ఏడాది మార్చిలో తమ ప్రేమ వివాహాన్ని బయటపెట్టి చాలా గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.వివాహ సంగతి విషయానికి వస్తే మరో 38 రోజుల్లో కిరణ్ అభవరాన్ని భర్త అని పిలిచేందుకు ఆగలేకపోతున్నాను అంటూ రహస్య తెలియజేసింది. అంటే దీన్ని బట్టి చూస్తే వీరి వివాహం ఆగస్టు 22న కాబోతోందని అర్థం.

కిరణ్ అబ్బవరం కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం క అనే ఒక సింగిల్ టైటిల్ సినిమాని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ సినిమా టీజర్ కూడా ఇటీవలే విడుదలైన ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. రహస్య గోరఖ్ మాత్రం మొదటి సినిమాతోనే తన కెరీర్ ని ఆపివేసింది. పూర్తిగా సినిమాలకు దూరమైన ఈమె ఒక ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వెర్ ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. వీరి వివాహ తేదీకి సంబంధించి డేట్ ని రహస్య తెలియజేయడంతో అభిమానులు, సిని సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: