ఓటీటీలో రచ్చ చేస్తున్న మహారాజా.. స్టార్ హీరోలకు వణుకు పుట్టే రికార్డ్..?

Pulgam Srinivas
తమిళ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న నటనలో ఒకరు అయినటువంటి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో హీరో పాత్రాలలో నటించడం మాత్రమే కాకుండా విలన్ , కీలక పాత్రలలో కూడా నటించి దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ నటుడు తెలుగు లో సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. అలాగే ఉప్పెన సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ రెండు మూవీ ల ద్వారా కూడా ఈయనకు మంచి గుర్తింపు తెలుగు లో లభించింది.
 

ఇకపోతే తాజాగా ఈ నటుడు మహారాజా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ఒకే రోజు తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. ఈ మూవీ అటు తమిళ్ , ఇటు తెలుగు రెండు ప్రాంతాలలో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకొని అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసిన ఈ సినిమా తాజాగా ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ ని ఈ సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అద్భుతమైన జోష్ లో దూసుకుపోతుంది. నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ ట్రెండింగ్ లో కొనసాగుతున్నట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇలా ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో నెట్ ఫ్లిక్స్ లో ప్రస్తుతం దూసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: