సూపర్: వారి వల్లే నేను హీరో.. ప్రభాస్ ఎమోషనల్ వీడియో వైరల్..!

Divya
స్టార్ హీరోగా పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ తాజాగా నటించిన కల్కి చిత్రంతో పాన్ వరల్డ్ హీరోగా పేరు సంపాదించారు.. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి ఎంతో అద్భుతంగా దర్శకత్వం వహించగా.. దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబచ్చన్ వంటి వారు ఇందులో అద్భుతంగా నటించారు. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ అయినట్లుగా తెలుస్తోంది.

తాజాగా ప్రభాస్ ఈ విషయం పైన ఒక షాకింగ్ వీడియో ని విడుదల చేశారు.వైజయంతి మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోని విడుదల చేయడం జరిగింది.. ప్రభాస్ మాట్లాడుతూ హాయ్ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ కల్కి కి మీరు ఇలాంటి హిట్ ఇచ్చినందుకు.. మీరు లేకపోతే నేనులేను అభిమానులు లేకుంటే నేను జీరో ఈ గొప్ప సినిమా కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ దాదాపుగా ఐదేళ్లు కష్టపడ్డారు నిజంగానే ఆయన ఒక హార్డ్ వర్క్ చేశారని కూడా తెలిపారు. ఆయన వల్లే ఈ సినిమా ఇంత క్వాలిటీ గా వచ్చిందని తెలిపారు.

అలాగే నిర్మాతలు అశ్వని దత్, స్వప్నా దత్ ,ప్రియాంకకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఇండియన్ సినిమాని లెజెండ్స్ అమితాబచ్చన్, కమలహాసన్ వంటి వారితో  కలిసి నటించే అవకాశం లభించినందుకు థాంక్స్ అని కూడా తెలియజేశారు. ప్రభాస్ మోస్ట్ గార్జియస్ లేడీ దీపికా పదుకొనేకు కూడా థాంక్స్ అని త్వరలోనే కల్కి-2 రాబోతోంది సిద్ధంగా ఉండండి అంటూ ఈ వీడియోలో తెలియజేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈ వీడియోని చూసి పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ అభిమానులు లేకపోతే నేను జీరో అనే విషయాన్ని చెప్పడం మరింత ఆకట్టుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: