ఇండియన్ 2 ప్లాప్ తో బాక్సాఫీసుని దున్నేస్తోన్న‌ కల్కి?

Purushottham Vinay

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ సెన్సేషన్ "కల్కి 2898 ఎడి". యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహాభారత ఇతివృత్తం ఆధారంగ తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తోంది.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి లాభాల బాటలో దూసుకుపోతుంది. మరి ముఖ్యంగా నైజాం లాంటి ఏరియాలో అయితే రూ.60కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడవగా రూ.100కోట్ల గ్రాస్ పైగా సాధించి డిస్ట్రిబ్యూటర్ కు కలెక్టన్ల సునామిని సృష్టించింది ఈ మూవీ.ఇక ప్రపంచ వ్యాప్తంగా కల్కి సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రూ. 1050 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ పై రాబట్టి రూ. 1100 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.కల్కి సినిమా వచ్చి ఇది మూడో వారం అయినప్పటికీ థియేటర్స్ లో ఇంకా ఈ సినిమా భారీ వసూళ్లతో అదరగొడుతుంది. 


పైగా శంకర్, కమల్ ఇండియన్ 2 ప్లాప్ కూడా ఈ సినిమాకి బాగా కలిసి వస్తోంది. ఇక వర్కింగ్ డేస్ లో ఎక్కడ డ్రాప్ లేకుండా కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. వీకెండ్స్ లో మాత్రం ఈ సినిమా దుమ్ము దులుపుతోంది. నిన్న ఈ రోజు హాలిడే కావడంతో కల్కికి స్ట్రాంగ్ కలెక్షన్స్ వచ్చాయని సమాచారం తెలుస్తుంది.ముఖ్యంగా శంకర్, కమల్ హాసన్ ల పాన్ ఇండియా చిత్రం భారతీయుడు 2కు మిశ్రమ స్పందన రావడంతో ప్రేక్షకులు కల్కి వైపు బాగా మొగ్గుచూపుతున్నారు. దీనితో కల్కికి మరో సాలిడ్ వీకెండ్ కుదిరింది అని చెప్పడంలో ఎలాంటి సందేహాం లేదు. ఇంకా అలాగే బాలీవుడ్ లో ఈ వీకెండ్ తో కల్కి రూ. 250 కోట్ల మార్క్ ని దాటేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. కల్కి సినిమా విజయంతో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఆయన పాత్రకి వస్తున్న రెస్పాన్స్ మాములుగా లేదు. ఇక ఈ వారంలో ఈ సినిమా ఖచ్చితంగా జవాన్ సినిమా వసూళ్ళని చాలా ఈజీగా దాటేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: