"డార్లింగ్" హక్కులను దక్కించుకున్న "భారతీయుడు 2" డిస్ట్రిబ్యూటర్స్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పాటు చేసుకున్న వారిలో ప్రియదర్శి ఒకరు. ఈయన పెళ్లి చూపులు అనే మూవీ తో తెలుగు తేరకు పరిచయం అయ్యి మంచి గుర్తింపు ఈ సినిమా ద్వారా సంపాదించుకున్నాడు. ఇక మల్లేశం అనే మూవీ తో ఈయన మొదటి సారి హీరో గా సినిమాలలో నటించడం మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. అలాగే ఈ మూవీ లోని ప్రియదర్శి నటనకి కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఈ నటుడు బలగం అనే సినిమాలో హీరో గా నటించాడు.
 

ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. దానితో ఈయన క్రేజ్ మరింతగా పెరిగింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు డార్లింగ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ యంగ్ లేడీ నబా నటేష్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని జూలై 19 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అన్ని ఏరియాల థియేటర్ హక్కులను ఈ మూవీ యూనిట్ వారు అమ్మి వేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యొక్క ఆంధ్ర ప్రదేశ్ థియేటర్ హక్కులను కూడా ఈ మూవీ బృందం అమ్మి వేసింది. ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్ థియేటర్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ ఎల్ పి సంస్థ దక్కించుకుంది.

ఈ విషయాన్ని ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే తాజాగా ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ ఎల్ పి సంస్థ కమల్ హాసన్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారతీయుడు 2 సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసింది. ఇక ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా ప్రస్తుతం ధియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: