సరిపోదా శనివారం : మరో క్రేజీ సాంగ్ రిలీజ్..అదిరిపోయిందిగా..!!

murali krishna
న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తన నటనతో స్టార్ హీరోగా ఎదిగిన నాని ఎన్నో సూపర్ హిట్ సినిమాలని తన ఖాతాలో వేసుకున్నాడు.. ఈ ఏడాది హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని సూపర్ హిట్ అందుకున్నాడు.. కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఆ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఇదిలా ఉంటే నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం’.. యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ సినిమా గా వస్తున్న సరిపోదా శనివారం నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ గరం గరం నాని ఫెరోషియస్ క్యారెక్టర్ ని ప్రజెంట్ చేసింది.ప్రముఖ నిర్మాత డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. 

ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ ఈ రోజు (శనివారం) సినిమా నుండి సెకండ్ సింగిల్ ఉల్లాసం సాంగ్ ని రిలీజ్ చేశారు, ఈ సాంగ్ ప్రేక్షకులకు మ్యాజికల్ ట్రీట్‌ను అందిస్తుంది.. ఈ పాటకు సనరే రాసిన లిరిక్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాగే నాని, ప్రియాంక మోహన్‌ల ఎక్స్ప్రెషన్స్ కూడా ఎంతగానో మెప్పుస్తున్నాయి.సంజిత్ హెగ్డే తన వోకల్స్ తో ఈ పాటకు ప్రాణం పోయగా, కృష్ణ లాస్య ముత్యాల కూడా తన ఎక్స్ ప్రెస్సీవ్ వాయిస్ తో మ్యాజిక్ చేసింది. నాని, ప్రియాంక మోహన్‌ల జంట తమ నేచురల్ ఎక్స్ ప్రెషన్స్ తో విజువల్స్‌కు బ్యూటీని యాడ్ చేశారు. లిజనర్స్ కి వెంటనే కనెక్ట్ అయ్యే ఈ పాటలో నాని గుడ్ మ్యూజిక్ టేస్ట్ మరోసారి ప్రేక్షకులకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ లో SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. వచ్చే నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది, కాబట్టి మేకర్స్ ప్రమోషన్స్ లో దూకుడు పెంచారు.ఆగస్ట్ 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: