ఆదర్శకుడికి మరో అవకాశం ఇచ్చిన విశ్వక్.. అతని రెండో సారి నమ్మాడు అంటే గ్రేట్..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విశ్వక్ సేన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ నటుడు ఆఖరుగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ... అంజలి ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి , కీలక పాత్రలో నటించిన అంజలి ఇద్దరు కూడా ఈ మూవీ లో అదిరిపోయే స్థాయిలో అందాలను ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కించారు.

కొన్ని రోజుల క్రితం విశ్వక్ "లైలా" అనే మూవీ ని ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఇక లైలా మూవీ షూటింగ్ ప్రారంభం కాకముందే విశ్వక్ మరో మూవీ ని కూడా లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు దర్శకత్వం వహించిన కృష్ణ చైతన్య కు విశ్వక్ మరో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ షూటింగ్ జరుగుతున్న సమయం లోనే ఈ దర్శకుడు నితిన్ తో ఓ మూవీ చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా ఆయనకు ఓ కథ కూడా చెప్పాడట.

ఆ కథ ఆయనకు బాగానే నచినప్పటికీ అనేక సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఇప్పుడు చేయలేను అని చెప్పాడట. దానితో అదే కథను విశ్వక్ కి వినిపించగా ఆయనకు ఈ మూవీ కథ అద్భుతంగా నచ్చడంతో వెంటనే ఈ దర్శకుడి మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా పెద్ద స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అయినప్పటికీ రెండవ సారి విశ్వక్ ఈ దర్శకుడికి అవకాశం ఇచ్చాడు అంటే ఆయన చెప్పిన కథ సూపర్ గా ఉండి ఉంటుంది , అందుకే విశ్వక్ ఆయనకు మరో అవకాశం ఇచ్చాడు అని పలువురు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: