16 రోజులైనా తగ్గని "కల్కి" జోష్.. "భారతీయుడు 2" కి గట్టి జలక్..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే కీలక పాత్రలలో నటించగా ... కమల్ హాసన్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. రాజేంద్ర ప్రసాద్ , దుల్కర్ సల్మాన్ , విజయ్ దేవరకొండ , మృణాల్ ఠాకూర్ , శోభన ఈ మూవీ లో ముఖ్య పాత్రాలలో నటించగా ... ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ , అనుదీప్ కే వి ఈ మూవీ లో చిన్న చిన్న క్యామియో పాత్రలలో కనిపించారు.

దిశా పటానీ ఈ మూవీ లో ప్రభాస్ కి జోడిగా నటించింది. జూన్ 27 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే అద్భుతమైన కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబడింది. ఇకపోతే నిన్న అనగా జులై 12 వ తేదీన లోక నాయకుడు కమల్ హాసన్ హీరో గా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారతీయుడు 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా తమిళ్ , తెలుగు , హిందీ భాషలలో విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు గనక అద్భుతమైన టాక్ వచ్చినట్లు అయితే కల్కి సినిమా కలెక్షన్ లు భారీగా తగ్గుతాయి అని చాలా మంది అనుకున్నారు.

కానీ ఈ మూవీ కి ఘోరమైన నెగటివ్ టాక్ రావడంతో కల్కి సినిమా విడుదల అయిన 16 వ రోజు కూడా అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇక విడుదల అయిన 16 వ రోజు కల్కి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 96 లక్షల కలెక్షన్ లను వసూలు చేయగా ... ఇక ఈ మూవీ 16 వ రోజు మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 5.11 కోట్ల షేర్ ... 10.35 గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా విడుదల అయిన 16 వ రోజు కూడా కల్కి సినిమా అద్భుతమైన కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: