కల్కి ఓటీటీ రిలీజ్.. సూపర్ డేట్ ఫిక్స్..!

shami
సలార్ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమా కల్కి 2898 ఏడి. ఈ సినిమా ను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె లాంటి స్టార్స్ నటించారు. ఐతే కల్కి సినిమా థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. సినిమా ఇప్పటికే 1000 కోట్లను రీచ్ కాగా ఫుల్ రన్ లో అది 1200 కోట్ల దాకా రాబట్టేలా ఉంది.
కల్కి సినిమా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ చేస్తేనే బాగుంటుందని కొందరు అంటున్నారు. ఐతే ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకుని ఎలాంటి సినిమా అయినా సరే మేము డిజిటల్ రిలీజ్ తర్వాతే చూస్తాం అనుకుంటున్న వారు ఉన్నారు. అలాంటి వారి కోసమే కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ బయటకు వచ్చింది. కొన్ని సినిమాలు థియేటర్ లో ఇలా ఫుల్ రన్ ముగియగానే అలా ఓటీటీలో రిలీజ్ చేస్తారు.
కొన్ని సినిమాలైతే థియేటర్ లో ఆడుతున్నా కూడా ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. కానీ కల్కి సినిమా రిలీజైన 8 వారాల తర్వాతే ఓటీటీ రిలీజ్ అవుతుందట. ఈ సినిమాను సౌత్ అన్ని భాషల్లో ప్రైం వీడియోస్ లో అందుబాటులో ఉంటుంది. హిందీ లో మాత్రం నెట్ ఫ్లిక్స్ అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ఈ సినిమాను ఆగష్టు 15న డిజిటల్ రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అసలైతే ఆ డేట్ కి పుష్ప 2 రావాల్సి ఉంది. ఆగష్టు 15న డబుల్ ఇస్మార్ట్ వస్తుంది. ఓటీటీలో కల్కి 1 ని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. మరి ఇది ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ఓటీటీ ఆడియన్స్ మాత్రం కల్కి అక్కడ కూడా రికార్డ్ వ్యూస్ రాబడుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: