టాలెంటెడ్ డైరెక్టర్ తో వెంకటేష్..!

shami
సీనియర్ హీరోలంతా ఇప్పుడు యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసేందుకు రెడీగా ఉన్నారు. సీనియర్ స్టార్స్ అంతా కూడా ఎన్నో సినిమాల అనుభవం ఉన్నా వారు ఇప్పుడు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తో పనిచేయాలనే ఆలోచన కలిగింది. యువ రక్తం కొత్త కొత్త కథలతో వస్తే తమని కొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తారన్నది వారి నమ్మకం. ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్ ఒక యువ దర్శకుడితో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.
ప్రస్తుతం అనీల్ రావిపుడితో సినిమా చేస్తున్న వెంకటేష్ తన నెక్స్ట్ సినిమాను వేను ఊడుగుల డైరెక్షన్ లో ఓకే చేసినట్టు తెలుస్తుంది. నీది నాది ఒకే కథ, విరాటపరం సినిమాలతో సత్తా చాటిన వేణు ఊడుగుల వెంకటేష్ తో ఒక డిఫరెంట్ కథ సెట్ చేసినట్టు తెలుస్తుంది. వెంకటేష్ కూడా ఈమధ్య కెరీర్ లో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.
F2 సినిమా హిట్ అయినా అది ఎంటర్టైనర్ గా మాత్రమే నిలిచింది. ఈమధ్య సీనియర్ హీరోలంతా తమ ఫ్యాన్స్ అందరికీ మాస్ ట్రీట్ ఇచ్చేలా సినిమాలు చేస్తున్నారు. ఐతే అలాంటి ప్రయత్నంలో భాగంగానే వెంకటేష్ సైంధవ్ సినిమా చేయగా అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. ఐఏ ఈసారి టార్గెట్ మిస్ అవ్వకూడదని వేణుతో భారీ స్కెచ్ వేసినట్టు అర్ధమవుతుంది. వేణు ఊడుగులతో వెంకటేష్ సినిమా ఏ జోనర్ లో వస్తుంది. అసలు సినిమా ఎలా ఉండబోతుంది అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సురేష్ బాబు నిర్మించనున్నారు. వేణు ఊడుగుల విరాటపర్వం సినిమాలో రానా లీడ్ రోల్ లో నటించాడు. ఐతే ఈ సినిమా నిర్మాణలో కూడా సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యం అయ్యింది. ఐతే ఈసారి వెంకటేష్ తో ఫుల్ మూవీ వారే నిర్మిస్తున్నారు. ఓ విధంగా వేణు కి ఇది చాలా మంచి అవకాశమని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: