గెటప్ శీను 'రాజు యాదవ్' సినిమాను.. ఆ బాలీవుడ్ స్టార్ రిమేక్ చేయబోతున్నడా?

praveen
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఎంతోమంది బుల్లితెర కమెడియన్స్.. వెండితెరపై కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక సినిమాల్లో కూడా వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నారు. అయితే ఇలా జబర్దస్త్ లో లాగానే వెండితెరపై కూడా కమెడియన్స్ గా కొంతమంది అలరిస్తూ ఉంటే.. ఇంకొంతమంది మాత్రం హీరోలుగా రాణిస్తూ ఉన్నారు. సుడిగాలి సుదీర్ గెటప్ శ్రీను లాంటివారు ఇప్పటికే హీరోలుగా పలి సినిమాలో నటించి గుర్తింపుని సంపాదించుకున్నారు అన్న విషయం తెలిసిందే.

 అయితే సుడిగాలి సుదీర్ ఇప్పటికే హీరోగా కాస్త నిలదొక్కుకున్నప్పటికీ గెటప్ శ్రీను మాత్రం సరైన గుర్తింపు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇక ఇటీవల రాజు యాదవ్ అనే సినిమాతో గెటప్ శ్రీను ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విభిన్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాప్ సొంతం చేసుకున్నప్పటికీ కమర్షియల్ గా మాత్రం అసలు వర్కౌట్ కాలేదు. ఈ మూవీలో అంకిత ఖారాన్ హీరోయిన్గా నటించింది. కృష్ణమాచార్య దర్శకత్వంలో తెరకేక్కింది. క్రికెట్ ఆడుతున్నప్పుడు మూతి మీద బాల్ తగిలి లైఫ్ లాంగ్ నవ్వుతూ ఉండేలా హీరో ఫేస్ మారిపోతుంది. ఆపరేషన్ చేయిస్తే మామూలుగా మారుతుంది. కానీ డబ్బులు లేక అలా వదిలేయడంతో ఇక ఏడుస్తున్న అతను ముఖంలో నవ్వుతున్నట్లుగానే ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది. ఇలాంటి సమస్య ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది సినిమా కాన్సెప్ట్.
 అయితే ఈ సినిమాని ఏకంగా ఒక స్టార్ హీరో ఇప్పుడు రీమేక్ చేయడానికి సిద్ధమయ్యాడట. బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావ్ రాజు యాదవ్ సినిమా చూశాడట. ఇక సినిమా తనకి నచ్చి రీమేక్ చేద్దామని అనుకుంటున్నాడు అంటూ వార్తలు తెరమీదికి  వచ్చాయి. సాధారణంగా రాజ్ కుమార్ మొదటి నుండి కూడా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ ఉంటాడు. ఇటీవల శ్రీకాంత్ అనే మూవీలో అందుడి పాత్రలో నటించి మెప్పించాడు. అయితే ఇక ఇప్పుడు రాజు యాదవ్ సినిమాలో హీరో పాత్ర వైవిధ్యంగా ఉండడంతో అతనికి బాగా నచ్చేసిందట. దీంతో ఎట్టి పరిస్థితుల్లో ఈ మూవీ ని రీమేక్ చేయాలని అనుకుంటున్నాడట. ఒకవేళ ఇదే నిజమైతే గెటప్ శ్రీను బాలీవుడ్లో ఎంట్రీ మరింత ఈజీ అవుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: