నానితో ఆడి పాడడానికి రెడీ అయిన పాన్ ఇండియా బ్యూటీ.. గట్టి ప్లాన్ వేసిన శైలేష్..?

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే నాని పోయిన సంవత్సరం దసరా , హాయ్ నాన్న అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు మూవీ లు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం నాని "సరిపోదా శనివారం" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక నాని ప్రస్తుతం తన తదుపరి మూవీ పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. నాని తన తదుపరి మూవీ గా శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దానితో ప్రస్తుతం శైలేష్ ఈ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ లో హీరోయిన్ ను కూడా సెలెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

అసలు విషయం లోకి వెళితే ... కే జి ఎఫ్ సిరీస్ మూవీ లతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శ్రీ నిధి శెట్టి నీ ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలి అని మూవీ బృందం అనుకున్నట్లు అందులో భాగంగా ఇమెని సంప్రదించి కథ ను , అందులోని ఈమె పాత్రను వివరించగా ఈమె కూడా నాని హీరో గా రూపొందబోయే సినిమాలో హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలబడబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే కే జి ఎఫ్ సిరీస్ మూవీ తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ కావడంతో శ్రీ నిధి శెట్టి కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: