వామ్మో: పెళ్లిపై అలా అనేసిన అనుష్క శెట్టి.. ఏం జరిగిందంటే..?

Divya
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ అనుష్క శెట్టి ఎంతోమంది స్టార్ హీరోలకు జోడిగా అద్భుతమైన పాత్రలో నటించింది. అయితే గతంలో మాదిరి వేగంగా సినిమాలు చేయకపోయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ అభిమానుల చెరగని ముద్ర వేసుకుంది. అనుష్క సినిమాలతో పాటు తన పర్సనల్ లైఫ్ వ్యవహారంలో కూడా నిరంతరం ఎప్పుడు వార్తలలో వైరల్ గా మారుతూ ఉంటుంది.. ప్రస్తుతం ఈ అమ్మడు వయసు 42 సంవత్సరాలు కానీ ఇప్పటివరకు వివాహ ఊసే ఎత్తడం లేదు. దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహంతో ఉన్నారు.

అయినప్పటికీ అనుష్క గురించి ఎన్నో రకాల రూమర్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. దాదాపుగా పదేళ్ల క్రితం అనుష్క తన పెళ్లి గురించి కొన్ని సంచలనం వ్యాఖ్యలు చేసింది.. అప్పట్లో జయప్రద హోస్టుగా చేసిన ఒక షోకి అనుష్క గెస్ట్ గా వెళ్లడం జరిగింది..అనుష్క తన పెళ్లి గురించి ఓపెన్ అయ్యింది.. జయప్రద మీరు ఎప్పుడు పెళ్లికూతురు అవుతారని అనుష్కను ప్రశ్నించారు.. ఈ విషయం పైన అనుష్క నవ్వుతూ సమాధానాన్ని తెలియజేస్తూ తాను ప్రస్తుతం బిజీగా ఉన్నాను రెండు మూడేళ్లలో వివాహం చేసుకుంటానని ఎందుకంటే కెరియర్ ఎంత ముఖ్యమో పెళ్లి కూడా అంతే ముఖ్యమని తెలిపిందట.

ఆ వెంటనే జయప్రద రెండు మూడేళ్లు అంటే లేట్ అవుతుందేమో కదా అని అనగా అనుష్క చిన్న నవ్వు నవ్వేసి వదిలేసింది.. అయితే ఆ షో జరిగి ఇప్పటికీ పదేళ్లు అవుతున్న ఇంకా వివాహం చేసుకోలేదు.. అయితే తనను చేసుకోబోయే వారిని ఇంట్లో వాళ్ళే చూస్తారా లవ్ మ్యారేజ్ అని జయప్రద అడగగా.. ఆల్రెడీ తనకు కాబోయే వాడిని చూసుకున్నానంటూ అనుష్క అప్పట్లో ఈ విషయం చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా మీమిద్దరం ఒకే అభిప్రాయంలో ఉన్నాము కరెక్ట్ సమయంలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యామని కూడా అనుష్క తెలిపిందట. కానీ ఇప్పటివరకు తన బాయ్ ఫ్రెండ్ ని చూపించలేదు పెళ్లి కూడా చేసుకోలేదు.. ఇక రూమర్స్ పైన జయప్రద అనుష్కను ప్రశ్నించగా ఇప్పటికీ టాలీవుడ్ లో బడా హీరోలతో పెళ్లి చేశారని తెలిపింది.. హీరో సుమంత్ తో నటించే అతడితో పెళ్లి రూమర్ క్రియేట్ చేశారు ఆ తర్వాత గోపీచంద్, ప్రభాస్ వంటి వారితో నటించిన ఇలాగే అన్నారు అంటూ నవ్వేసిందట ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: