రామ్ చరణ్ దగ్గర ఇన్ని కార్లు ఉన్నాయా.. వాటి విలువ ఎన్ని కోట్లో తెలుసా?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన రామచరణ్.. తండ్రికి తగ్గ వారసుడిగా కాదు తండ్రిని మించిన వారసుడిగా పేరు సంపాదించుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఏకంగా అప్పటివరకు తెలుగు చిత్రపరిశ్రమలో మెగా పవర్ స్టార్ గా మాత్రమే గుర్తింపును సంపాదించుకున్న రామ్ చరణ్.. త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు.

 ఇక ఇప్పుడు రామ్ చరణ్ గురించి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా అది వైరల్ గా మారిపోతుంది అని చెప్పాలి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకేకుతున్న గేమ్ చేంజెర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ లేదా డిసెంబర్లో రిలీజ్ కాబోతుంది అని చెప్పాలి. ఈ మూవీ తర్వాత ప్రాజెక్టులను కూడా ఇప్పటికే లైన్లో పెట్టేసాడు  తర్వాత బుచ్చిబాబు సన, సుకుమార్ లాంటి డైరెక్టర్లతో సినిమాలు తీసేందుకు రెడీగా ఉన్నాడు రామ్ చరణ్  అయితే మొదటినుంచి రామ్ చరణ్ భారీగానే ఆస్తులను కలిగి ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.

 అయితే రామ్ చరణ్ కి కార్లు అంటే ఎంత ఇష్టం. అందుకే మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చినా కూడా అది తన గ్యారేజ్ లో ఉండాలని అనుకుంటూ ఉంటాడట. ఇప్పటికే చిరంజీవి దగ్గర రోల్స్ రాయిస్ తో పాటు మరో నాలుగు కార్లు కూడా ఉన్నాయి. ఇక రాంచరణ్ కి దాదాపు 6 ఖరీదైన కార్లు ఉన్నాయట. చరన్ ఏకంగా బ్లాక్ కలర్ రోల్స్ రాయిస్ కొత్త వర్షన్ పెట్రా కొనుక్కున్నాడు  దాదాపు 7.5 కోట్ల ఖరీదు ఉంటుంది ఈ కారు. జనవరిలో ఈ కారు విడుదలవగా ఈ కారును కొన్న మొదటి వ్యక్తి రామ్ చరణ్ కావడం గమనార్హం. ఈరోల్స్ రాయిస్ కారుతో పాటు మరో అరడజన్ కార్లు కూడా చరణ్ దగ్గర ఉన్నాయట. నాలుగు కోట్ల విలువైన మెరిసిటీస్ బెంజ్, కోటి రూపాయల విలువైన మెర్సడైస్ బెంజ్ జి ఎల్ జి 400, 3.2 కోట్ల విలువైన హాస్టన్ మార్టిన్ వంటేజ్, 3.5 కోట్ల విలువైన ఫెరారీ కోర్టోపినో, 2.75 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ, 1. 75 కోట్ల విలువ చేస్తే బిఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ కార్లు కూడా చరణ్ దగ్గర ఉన్నాయట

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: