దర్శక ధీరుడు రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకువెళ్ళాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే ఈ సినిమాతో దర్శకుడుగా మరింత ఎత్తుకు ఎదిగాడు రాజమౌళి. అయితే ఈ సినిమా తర్వాత ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న సినిమా ssmb29. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం సినీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గుంటురు కారం రిలీజ్ తరువాత షార్ట్ బ్రేక్ తీసుకున్న మహేష్, వెంటనే నెక్ట్స్ మూవీ వర్క్ షురూ చేశారు. రాజమౌళి దర్శకత్వంలో ఓ గ్లోబల్ మూవీ ప్లాన్ చేసిన సూపర్ స్టార్, ఆ సినిమా కోసం మేకోవర్
అయ్యే పనిలో ఉన్నారు. ట్రిపులార్ రిలీజ్ తరువాత ఎక్కువ రోజులు ఆ సినిమా ప్రమోషన్స్ మీదే గడిపిన జక్కన్న కూడా ఇప్పుడు పూర్తిగా మహేష్ మూవీ మీదే వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎస్ఎస్ఎంబీ 29గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించి, స్క్రిప్ట్ వర్క్ ఈ మధ్యే పూర్తయ్యింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. దీంతో త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. అయితే అంతకు ముందే బిగ్ ప్లాన్ రెడీ చేశారు జక్కన్న . ఐతే ఈ చిత్రంలో మహేశ్ రెండు పాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకటి హీరో పాత్ర అన్నది కన్ఫార్మ్. రెండోది విలన్ అని
సమాచారం. కాగా విలన్ పాత్రకు మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ని అనుకున్నారనే వార్త వచ్చింది. ఆ తర్వాత విక్రమ్ పేరు వినిపించింది. అయితే ఈ రెండు పాత్రలనూ మహేశ్‌బాబుతోనే చేయించాలని రాజమౌళి అనుకుంటున్నారట. ఆఫ్రికాలోని అమేజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మహేశ్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఈ మధ్య కండలు తిరిగిన దేహం, కాస్త లెంగ్తీ హెయిర్, గడ్డంతో కొత్తగా కనిపిస్తున్నారు మహేశ్. రాజమౌళి సినిమా కోసమే ఇలా మేకోవర్ అయ్యారని సమాచారం. త్వరలో ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలని అనుకుంటున్నారు...!!