ఒక్కడు మూవీకి ఎంత ఖర్చు పెడితే ఎంత వచ్చిందో తెలుసా.. ఏకంగా అంతా లాభం..?

Pulgam Srinivas
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించాడు. ఇకపోతే మహేష్ బాబు కెరియర్ లో అద్భుతమైన విజయం సాధించిన సినిమాలలో ఒక్కడు మూవీ ఒకటి. ఈ సినిమాలో భూమిక చావ్లా హీరోయిన్ గా నటించగా ... గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎం ఎస్ రాజు ఈ మూవీ కి నిర్మాతగా వ్యవహరించాడు. ఇకపోతే ఈ సినిమాను ఆ సమయం లోనే అత్యంత భారీ బడ్జెట్ లో రూపొందించారు.

ఇకపోతే ఈ మూవీ కి ఆ సమయం లోనే 9 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు సమాచారం. మరి అంతగా బడ్జెట్ కావడానికి ప్రధాన కారణం ఈ సినిమా కోసం గుణశేఖర్ అనేక సెట్ లను వేయడమే. ఇక ఎంతో ఖర్చుతో ఈ సినిమాను రూపొందిస్తున్న సమయంలో చాలా మంది ఈ సినిమాను అనవసరంగా భారీ ఖర్చుతో రూపొందిస్తున్నారు. కాస్త అటు ఇటు అయినా కాని సినిమాకి ద్వారా భారీ నష్టాలు వస్తాయి అని చాలా మంది అనేవారట. ఇక ఈ సినిమా విడుదల అయిన తర్వాత అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది.

దానితో ఈ మూవీ 9 కోట్లు ఖర్చు పెట్టి రూపొందిస్తే ఏకంగా 39 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే అప్పటి వరకు మహేష్ బాబు కెరియర్ లోనే ఈ సినిమానే హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాగా నిలిచింది. అలా భారీ ఖర్చుతో రూపొందించి అత్యంత గ్రాండ్ గా తెరకెక్కించిన ఈ సినిమా ఆ సమయంలో అదే స్థాయిలో కలెక్షన్ లను కొల్ల గొట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇక ఈ మూవీ లోని మహేష్ , భూమిక నటనలకి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ఆ సమయంలో అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: