వైసీపీ కి వణుకు పుట్టిస్తున్న టీడీపీ.. వరుసగా మరికొన్ని దాడులు..!

Pulgam Srinivas
2019 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలా వచ్చాక వైసిపి పార్టీ నేతలు , కార్యకర్తలు అంతా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనవసరంగా మా కార్యకర్తలతో , నేతలతో గొడవలు పెట్టుకుంటున్నారు అని టిడిపి పార్టీ నాయకులు , కార్యకర్తలు చెబుతూ వచ్చారు. అలాగే కొంత మంది మళ్ళీ అధికారంలోకి రాబోయేది మేమే. ఇప్పుడు మాకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో అప్పుడు వాళ్లకు అలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పిన వారు కూడా ఉన్నారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో మళ్లీ తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వచ్చింది.

ఇక దానితో వరుసగా కొన్ని దాడులు జరుగుతున్నట్లు సాక్షి కథనాలను విడుదల చేస్తుంది. ఇకపోతే తాజాగా కూడా కొన్ని ప్రాంతాలలో టిడిపి నేతలు వైసిపి నేతలపై దాడి చేసినట్లు కథనాలను ప్రచారం చేసింది. ఆ కథనాల ప్రకారం ఏలూరు జిల్లా ఆగిరిపల్లి లో ఆదివారం రాత్రి టిడిపి నేతలు రెచ్చిపోయారు అని  ఎంపీటీసీ సభ్యుడు సాదం గోపి , వైఎస్ఆర్సిపి గ్రామ అధ్యక్షుడు చిమట శ్రీనివాసరావు పై దాడి చేశారు అని కథనాన్ని ప్రచురించింది. దీనితో పాటు గుంటూరు డిప్యూటీ మేయర్ కార్యాలయం ధ్వంసం చేసినట్లు తెలిపారు.

ఈ కథనం ప్రకారం గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ వనమా బాల వజ్రా బాబు కార్యాలయం పై టి డి పి కి చెందిన కొంత మంది దుండగు లు సోమవారం సాయంత్రం దాడి చేసి ధ్వంసం చేశారు అని ఈ మేరకు మరో కథనాన్ని రాసుకొచ్చింది. దీనితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతి నిధ్యం వహిస్తున్న పిఠాపురం లో అధికారులు సోమవారం అత్యుత్సాహం ప్రదర్శించి ముందస్తు నోటీసులు ఎలాంటి హెచ్చరికలు లేకుండా హడావిడిగా దుకాణాలను కూల్చివేసినట్లు వారు కథనాలను ప్రచారం చేశారు. ఇలా టి డి పి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రాంతాలలో వై సి పి పార్టీ నేతలపై టి డి పి వారు అనవసరంగా దాడులు చేస్తున్నట్లు కథనాలను సాక్షి ప్రచురించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: