దేవర షూటింగ్ లో జాయిన్ అయినా నటి.. ఇక రచ్చ రంబోలానే..!
ఇక ప్రస్తుతం తారక్ నటిస్తున్న మూవీ దేవర. మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో మనందరికీ తెలిసిందే. డైరెక్టర్ కొరటాల శివ ఈ మూవీని రూపొందించడంతో దేవర చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి సునామీ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ అండ్ ట్రైలర్ మరియు ఫియర్ సాంగ్ ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాయి. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది.
కాదా ఈ సినిమాలో మరో నటి శ్రుతి మరాఠే కూడా నటిస్తుంది. ఎన్టీఆర్ భార్య పాత్రలో ఈ బ్యూటీ నటిస్తుంది. ఇక తాజాగా ఈమె హైదరాబాద్లో జరుగుతున్న దేవరా షూటింగ్లో జాయిన్ అయ్యింది. ఈ మేరకు ఇక ఇంస్టాగ్రామ్ స్టోరీ లో అప్డేట్ ఇచ్చింది కూడా. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైజ్ ఫాలీ కాన్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.