భారతీయుడు 2 కోసం మెగా ఫాన్స్ వెయిటింగ్.. సక్సెస్ కోసమేనా.!?

Anilkumar
లోకనాయకుడు కమలహాసన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా భారతీయుడు 2. శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇకపోతే ఈ సినిమాతో ఎలాగైనా హెట్టు కొట్టాలి అని మెగా అభిమానులు భారతీయుడు సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఎందుకంటే ఇండియన్ టు సక్సెస్ అయితే మెగా ఫ్యాన్స్ కి కూడా ఒకింత లాభం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకొందాం.. అయితే శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న సంగతి మన

 అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే గేమ్ చేంజర్ సినిమాను  పక్కన పెట్టేసిన శంకర్ ఇటు ఇండియన్ టు సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. అయితే రెండు సినిమాలు ఒకేసారి చేస్తున్నప్పటికీ ఇండియన్ టు సినిమా నే మొదట ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. అయితే ఇండియన్ టు సినిమా మొదట విడుదల అయితే ఈ సినిమా విడుదలై మంచి సక్సెస్ అందుకుంటే రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాపై మరింత హైప్ నెలకొంటుంది. అలా ఈ సినిమా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు. అందుకే భారతీయుడు 2 సినిమా ఫస్ట్ రోజు చూడడానికి మెగా అభిమానుల

 సిద్ధమవుతున్నట్లు టాక్ నడుస్తుంది. ఇక నార్మల్‌గానే శంకర్ సినిమాలను తీయడంలో చాలా ఎక్స్పర్ట్. కనుక ఈ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చాలా మంది ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ సినిమా మీద అందరు పెట్టుకున్న అంచనాలను శంకర్‌ అందుకోగలుగుతాడా..? లేదా..? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.. ఇక పాన్ ఇండియాలో తెలుగు సినిమాలు రిలీజ్ అయి భారీ సక్సెస్ లో అందుకుంటున్న క్రమంలో భారతీయుడు 2 సినిమా రిలీజ్ ను ప్లాన్ చేశాడు శంకర్. మరి ఈ పాన్ ఇండియన్ మూవీ ఎంతవరకు కలెక్షన్లను రాబడుతుందో.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: