భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న సినిమాలో దేవర కూడా ఒకటి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరో గా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నరు. ఇక ఈ సినిమాకి సంబంధిచిన షూటింగ్ శెరవేగంగా సాగుతుంది. మరో పక్క తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయి బిజినెస్ ని జరుపుకుంటుంది . ఇదిలా ఉండగా షూటింగ్ తో పాటు డబ్బింగ్ పనులు ఏకకాలంలో జరుపుకుంటున్నారు మేకర్స్. ఒకే సమయంలో రెండు పనులను పూర్తి చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి తాజా వార్త బయటికి వచ్చింది.
అదంటంటే.. దేవర సినిమాకి యాంగ్ నటి హిమజ డబ్బింగ్ వర్క్ కి సంబంధించిన పనులు స్టార్ అయినట్లు తెలిపింది. దాని వల్ల ఈ సినిమాలో హిమజ కూడా ఉన్నట్లు సినీ లవర్స్ కి కాస్త క్లారిటీ వచ్చింది. అంతే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్లు క్లారిటీ వచ్చింది. ఏది ఎమ్ అయినప్పటికీ దేవర మూవీ ఫుల్ స్వింగ్ లో ఉంది అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి అనిరుద్ అద్భుతమైన సంగీతాని అందిస్తున్నారు. కాగా సైఫా అలీ ఖాన్, మురళి శర్మ, శ్రీకాంత్,రమ్య కృష్ణన్ వంటి నటీనటులు ఈ సినిమాలో
నటిస్తున్నారు. సెప్టెంబర్ 27 న మేకర్స్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరో గా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమాని గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఆర్ ఆర్ ఆర్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవర సినిమాతో తెరమీదకు వస్తుండడం తో ప్రేక్షకులు మరియు టాలీవుడ్ మాస్ ఆడియన్స్ సైతం ఈ చిత్రం పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ మరో సరి రికార్డ్ సృష్టిస్తాడ లేదా అనేది మూవీ రిలీజ్ తర్వాత చూడాలి