సీక్రెట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన డింపుల్ హయాతి.. త్వరలోనే పెళ్లి...!

lakhmi saranya
టాలీవుడ్ యంగ్ బ్యూటీ డింపుల్ హయాతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ఈ ముద్దుగుమ్మ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దల కొండ గణేష్ చిత్రంలో ఐటమ్ సాంగ్ లో స్టెప్పులు వేసి కుర్రాళ్ళ మనుషులను దలుచుకుంది. అదేవిధంగా ఈ ఒక్క సాంగ్ తో ఇండస్ట్రీని ఊపు ఊపింది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్ ను దక్కించుకోవడంతో .. ఈ అమ్మడి క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఇక అనంతరం ఈ బ్యూటీ రామబాణం అండ్ కిలాడి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

అప్పట్లో ఓ పోలీస్ ఆఫీసర్ తో గొడవపడి దేశవ్యాప్తంగా డింపుల్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక తన మాట తీరుతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది . అనంతరం నుంచి సినిమాలకు కాస్త దూరం అయింది ఈ బ్యూటీ . కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ .. పలు ఫోటోషూట్ లు చేస్తూ అభిమానులను సంపాదించుకుంటుంది . ఇక ఈ క్రమంలోనే తాజాగా డింపుల్ హయాతి కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

ఈ ముద్దుగుమ్మ గత కొద్ది కాలంగా సీక్రెట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నట్లు సమాచారం . అంతేకాకుండా త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది . హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్తతో ఈ అమ్మడు ప్రేమయనం కొనసాగిస్తున్నట్లు సమాచారం . ఇక వీరి ప్రేమకు పెద్దలను కూడా ఒప్పించి తొందర్లోనే ఓ ఇంటి కోడలు కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి . మరి ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ ప్రెసెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది . ఈ వార్తను చూసిన ఈ బ్యూటీ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: