కనక తో అడుగుపెట్టబోతున్న జనక !

Seetha Sailaja

హీరో సుహాస్ కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆతరువాత హీరోగా మారి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన రీతిలో ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అవ్వాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ‘అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్’ మూవీ తరువాత సుహాస్ నటించిన సినిమాలు చాలవరకు పరాజయం చెందడంతో త్వరలో విడుదల కాబోతున్న అతడి లేటెస్ట్ మూవీ ‘జనక అయితే కనక’ తో ఒక డిఫరెంట్ మూవీ కథలా కనిపిస్తోంది.

దిల్ రాజ్ కూతురు నిర్మాతగా మారి నిర్మించిన ఈమూవీ త్వరలో విడుదల కాబోతోంది. సందీప్ బండ్ల దర్శకత్వంలో రూపొందిన ‘జనక అయితే కనక’ మూవీ టీజర్ ఆశక్తికరంగా ఉండటంతో ఈమూవీ పై అంచనాలు బాగా పెరిగాయి. చిన్న ఉద్యోగంతో గుట్టుగా సంసారాన్ని నెట్టుకొస్తున్న ఒక మధ్య తరగతి యువకుడు తనకు పిల్లలు పుడితే వారిని పెంచే శక్తి తనకు లేదు అని భావించే నేపధ్యంలో అతడి మనస్తత్వంలో మార్పు ఎలా తీసుకు వచ్చారు అన్న పాయింట్ చుట్టూ ఈమూవీ కథను అల్లారు.  

ఈమూవీ కథ కాన్సెప్ట్ వెరైటీగా అనిపించడంతో పాటు సరదాగా ఉండటంతో ఈమూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనాలలో ఉన్నాయి. మిడిల్ క్లాస్ ఫాదర్ గా మరోసారి గోపరాజు రమణ తన నటనతో ఈమూవీలో హైలెట్ కాబోతున్నాడు. హీరోయిన్ గా సంకీర్తన అనే కొత్త అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు.

ఈనెలాఖరున కానీ ఆగష్టులో కానీ విడుదల కాబోయే ఈ చిన్న సినిమా ఊహించని విజయం సాదిస్తుందని దిల్ రాజ్ కాంపౌండ్ నమ్మకం పై ఉంది. వరస ఫ్లాప్ లతో సత్యమతమైపోతున్న సుహాస్ కెరియర్ కు ఈమూవీ విజయం అత్యంత కీలకంగా మారింది. ‘కల్కి 2898’ ‘భారతీయుడు 2’ లాంటి భారీ సినిమాలను చూసిన ప్రేక్షకులు కామెడీ టచ్ తో తీసిన ఈ మూవీని ఎంజాయ్ చేసి ఆదరిస్తే ఇలాంటి చిన్న సినిమాలు ఇంకా చాల వచ్చే ఆస్కారం ఉంది..      


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: