పెళ్లయి పది రోజులు కాకముందే ప్రెగ్నెన్సీ.. బాలీవుడ్ నటి రియాక్షన్ ఇదే..!

lakhmi saranya
బాలీవుడ్ నటి సోనాక్షి సింహం గురించి ప్రత్యేకంగా పరిశ్రమ అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తాజాగా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గత నెల 23ని పెళ్లి చేసుకున్న ఏమే గర్భం దాల్చినట్లు రెండు మూడు రోజులుగా జోరుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఆమె సరదాగా చేసిన కామెంట్స్ ఈ వార్తల కంటే వైరల్ అవుతున్నాయి. ఈమధ్య ఆమె టైమ్స్ నౌ తో మాట్లాడుతూ తన ప్రెగ్నెన్సీ పుకార్లపై రియాక్ట్ అయ్యింది. సోనాక్షి సింహ జూన్ 23న తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ జహీర్ ను పెళ్లి చేసుకోండి.

అయితే ఆ వెంటనే ఈ జంట హాస్పిటల్ కు వెళ్ళింది. దీంతో సోనాక్షి అప్పుడే ప్రెగ్నెంట్ అంటూ పుకార్లు మొదలయ్యాయి. వీటిపై తాజాగా టైమ్స్ నౌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది సోనాక్షి. ఈమె మాట్లాడుతూ.." జీవితం ఇంతకంటే గొప్పగా ఉండదు . నా పెళ్ళిలో విశేషం ఏమిటంటే జీవితంలో పెద్ద మారుపేమి రాలేదు . పెళ్లికి ముందు కూడా నా జీవితం ఎంతో బాగుండేది . ఇప్పుడు మళ్లీ అందులోకే తిరిగి వచ్చాను. మళ్లీ షూటింగ్ లు మొదలుపెట్టడం సంతోషంగా ఉంది .

ఒకే ఒక్క మార్పు ఏంటంటే .. ఇప్పటి నుంచి మేము హాస్పిటల్ కి వెళ్ళలేము. ఎందుకంటే అక్కడికి వెళ్తే చాలు నేను ప్రెగ్నెంట్ అని అందరూ అనుకుంటున్నారు " అంటూ సోనాక్షి ఫన్నీగా రియాక్ట్ అయింది . ప్రెసెంట్ సోనాక్షి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . సోనాక్షి సిన్హా, జహీర్ ఏడేళ్ల డేటింగ్ తరువాత జూన్ 23వ తారీఖున పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ముస్లింను పెళ్లి చేసుకోవడంపై కూడా సోనాక్షి పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అయితే ప్రేమే పెద్ద మతం అంటూ ఆ ట్రోలింగ్ను ఆమె తిప్పి కొట్టింది. జహీర్ కూడా ఓ నటుడే. సోనాక్షి తో కలిసి అతడు డబుల్ ఎక్సెఎల్ మూవీలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: