ప్రభాస్: ఆ 3 సినిమాల వసూళ్లు కూడా 1000 కోట్లు దాటడం పక్కా?

Purushottham Vinay

ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ 'కల్కి 2898 ఏడీ'. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. ఇంకా అలాగే సీనియర్ స్టార్ హీరోస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. దిశా పటానీ గ్లామర్ పాత్రలో మెరిసింది. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రానికి కబాలి, మహాన్ లాంటి సూపర్ హిట్ మూవీస్ కి మ్యూజిక్ అందించిన తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. జూన్ 27 వ తేదీన విడుదలైన్ ఈ సినిమా ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది.  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకు 8వ రోజు కూడా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది.


 భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. ఫలితంగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి మొత్తం రూ. 5.50 కోట్లు షేర్ రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్‌గా కూడా సత్తా చాటింది. వరల్డ్ వైడ్ ఏకంగా రూ. 20 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. ఇలా ఇప్పటి వరకూ మొత్తం రూ. 363 కోట్ల షేర్ రాబట్టి విజయానికి బ్రేక్ ఈవెన్ కి చేరువగా వచ్చేసింది. 380 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా వచ్చిన ఈ సినిమా ఇంకా కేవలం 17 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇప్పటిదాకా 725 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది ఈ సినిమా. ఈ స్పీడ్ కొనసాగితే రెండు వారాల్లో వెయ్యి కోట్ల క్లబ్ లో కల్కి మూవీ చేరిపోతుంది. 


బాహుబలి 2 తర్వాత మరో వెయ్యి కోట్ల కలెక్షన్ సాధించే సినిమా ఖాతాలో వేసుకోవడానికి ప్రభాస్ చాలా ఏళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది. సలార్ మూవీ 1000 కోట్లు దాటుతుందని ఫ్యాన్స్ అంచనా వేశారు. కానీ ఆ మూవీ 600 కోట్ల వరకు వచ్చి ఆగిపోయింది. అయితే కల్కి 2898 ఏడి మాత్రం కచ్చితంగా వెయ్యి కోట్ల మార్క్ ని అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో షారుఖ్ ఖాన్ పేరు మీద ఉన్న రికార్డ్ ని ప్రభాస్ త్వరలో సమం చేయనున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్  మరో మూడు వెయ్యి కోట్ల ప్రాజెక్ట్స్ ప్రభాస్ ఖాతాలో చేరినట్లే చెప్పాలి. 


సలార్ సినిమా హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా వస్తోన్న సలార్ 2 కచ్చితంగా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇంకా అలాగే కల్కి2898ఏడీ మూవీ సక్సెస్ కావడంతో దీనికి కొనసాగింపుగా రానున్న పార్ట్ 2 కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరే సినిమా అవుతుందని చెబుతున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కూడా 1000 కోట్లు రాబట్టడం పక్కా అంటున్నారు. ఈ మూడు సినిమాలు ప్రభాస్ ఖాతాలో 1000 కోట్ల క్లబ్ సినిమాలుగా చేరితే అతని రికార్డ్ ని ఎవరూ కూడా అందుకోలేరనే మాట వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: