నాగచైతన్య కోసం.. నాగార్జున వెక్కివెక్కి ఏడ్చాడట తెలుసా?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న బడా ఫ్యామిలీలలో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. అలనాటి స్టార్ హీరో నాగేశ్వరరావు.. అక్కినేని అనే పేరును ఒక బ్రాండ్ గా మార్చేశారు. నటసామ్రాట్ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అని చెప్పాలి. ఇలా నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నాగార్జున. తండ్రికి తగ్గ తనయుడిగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇక ఇప్పుడు నాగార్జున వారసుడిగా అఖిల్ నాగచైతన్య ఇద్దరు కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోలుగా పరిచయమయ్యారు. అయితే ఈ ఇద్దరు తన తండ్రి తాత లాగా స్టార్ హీరోలుగా ఎదిగేందుకు మాత్రం తెగ కష్టపడి పోతున్నారు. కానీ ఎన్ని సినిమాలు చేసినా సరైన గుర్తింపు మాత్రం రావడం లేదు. కొడుకుల సినీ కెరియర్లను నిలబెట్టడం కోసం అటు నాగార్జున కూడా ఎన్నో కసరత్తులు చేస్తున్న ఫలితం లేకుండా పోతుంది. అయితే ఇక ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో నాగార్జున కన్నీళ్లు పెట్టుకున్నారట.

 అయితే ఇది ఇప్పుడు కాదు చిన్నతనంలో అన్నది తెలుస్తుంది. నాగార్జున అమలకి పెళ్లికాకముందు నాగార్జున రామానాయుడు కూతురు లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే. ఇలా నాగార్జున, లక్ష్మీ దంపతులకు పుట్టిన బిడ్డ నాగచైతన్య. అయితే నాగచైతన్య పుట్టాక వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని వేరుపడ్డారు. ఇక ఇలా విడాకులు పూర్తయిన తర్వాత చట్ట ప్రకారం పుట్టిన పిల్లలు ఒక ఏజ్ వచ్చే వరకు తల్లి దగ్గరే ఉంటారు. కాబట్టి నాగచైతన్య లక్ష్మీ దగ్గర పెరిగారు. అయితే సమ్మర్లో మాత్రం నాగార్జున దగ్గరికి వచ్చేవారట. ఇలా నాగచైతన్య రావడంతో నాగార్జున ఆనందానికి అవధులు ఉండేవి కాదట. ఏం అడిగినా కొనిచ్చేవారట. ఇక నాగచైతన్య వచ్చినప్పుడు అఖిల్ కూడా ఎంతో సంతోషపడేవాడట. అయితే సమ్మర్ హాలిడేస్ అయిపోయి మళ్ళీ నాగచైతన్య లక్ష్మీ దగ్గరికి వెళ్లే సమయం లో మాత్రం నాగచైతన్య ఎంతగానో బాధ పడిపోయేవాడట. తన మనసులో అంత బాధ పెట్టుకుని లోపులో ఎంతగానో ఏడ్చేవారట. ఇక నాగచైతన్య వెళ్ళిపోయిన తర్వాత కూడా బెడ్రూంలో ఒక్కడే కూర్చొని వెక్కివెక్కి ఏడ్చేవారట నాగార్జున.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: