తెలుగు సినీ పరిశ్రమలో మంచి కాంబినేషన్లో చిరంజీవి , అశ్విని దత్ కాంబినేషన్ ఒకటి. వీరి కాంబోలో మొదటగా జగదేక వీరుడు అతిలోక సుందరి అనే మూవీ వచ్చింది. ఈ మూవీ అప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో ఏ మూవీ కూడా కలెక్ట్ చేయని కలెక్షన్లను వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఈ మూవీ తోనే చిరు , అశ్విని దత్ కాంబోకి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో చూడాలని ఉంది అనే మూవీ రూపొందింది. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఈ మూవీ తర్వాత చిరంజీవి హీరోగా అశ్వినీ దత్ నిర్మాణంలో బి.గోపాల్ దర్శకత్వంలో ఇంద్ర అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందింది. ఈ సినిమా కూడా అప్పటి వరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను రాబట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలా విరి కాంబోలో రూపొందిన మూడు సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలు అయిన తర్వాత చిరు హీరోగా అశ్విని డేట్ నిర్మాణంలో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో జై చిరంజీవ అనే మూవీ రూపొందింది.
కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను డిసప్పాయింట్ చేసింది. ఈ మూవీ తర్వాత వీరిద్దరి కాంబోలో ఇప్పటివరకు సినిమా రాలేదు. ఇక తాజా ఇంటర్వ్యూలో భాగంగా అశ్విని దత్ మాట్లాడుతూ ... జై చిరంజీవ సినిమా తర్వాత చిరుతో మా బ్యానర్ నుండి సినిమా రాలేదు. కానీ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ది ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథను మొదటగా చిరంజీవికి వినిపించాం. ఆ స్టోరీ నచ్చితే చిరంజీవితో దానిని సినిమాల రూపొందించాలి అనుకున్నాం. కానీ ఆ కథ చిరంజీవికి పెద్దగా నచ్చలేదు. అందుకే ఆ సినిమా వర్కౌట్ కాలేదు అని అశ్విని తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.