కల్కి 2898 AD : తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు ఆ స్థానంలో ఉన్న "కల్కి"..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఇక 6 వ రోజు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ కలెక్షన్లను సాధించిన సినిమాల విషయంలో ఏ స్థానంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల అయిన ఆరవ రోజు రెండో తెలుగు రాష్ట్రాల్లో 9.54 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల అయిన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.52 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది.
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అలా వైకుంఠపురంలో సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన ఆరవ రోజు 9.44 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమా విడుదల అయిన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.2 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి నాలుగువ స్థానంలో నిలిచింది.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా విడుదల అయిన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.89 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి ఐదవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: