కల్కి 2898 AD : 3D కళ్ళజోళ్ళ తోనే "కల్కి" కి ఎంత డబ్బు వచ్చిందో తెలుసా..?

Pulgam Srinivas
నాగ్ అశ్విన్ తాజాగా ప్రభాస్ తో కల్కి 2898 AD అనే అత్యంత భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ని తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ , దీపికా పదుకొనే అత్యంత కీలక పాత్రలలో నటించగా ... శోభన మృణాల్ ఠాకూర్ , బ్రహ్మానందం , రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటించారు. దిశా పటాని ఈ మూవీ లో ప్రభాస్ కి జోడిగా నటించగా , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ , విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ ఈ మూవీ లో చిన్న చిన్న క్యామియో పాత్రలలో నటించారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్వినీ దత్ కూతురు స్వప్న దత్ నిర్మించింది.

సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... లోక నాయకుడు కమల్ హాసన్ ఈ మూవీ లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఇకపోతే జూన్ 27 వ తేదీన ఈ మూవీ విడుదల అయింది. ఈ మూవీ ని 2D  3D వర్షన్ లలో విడుదల చేశారు. ఈ మూవీ ని నైజాం ఏరియాలో చాలా థియేటర్లలో 3D వర్షన్ లో విడుదల చేశారు. ఈ మూవీ 3D వర్షన్ కి నైజాం ఏరియాలో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

దానితో నిర్మాతకు కేవలం నైజాం ఏరియాలో 3D కళ్ళజోళ్ళ తోనే దాదాపు కోటి రూపాయల వరకు డబ్బు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా 3D కళ్ళజోళ్ళ తోనే నిర్మాతకు పెద్ద మొత్తంలో డబ్బులు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఏదేమైనా ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వరల్డ్ వైడ్ వచ్చింది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే మరో కొన్ని వారాలు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: