వామ్మో: దుబాయ్ యూట్యూబర్ తో హీరోయిన్ పెళ్లి.. ఎవరంటే..?

Divya
కోలీవుడ్లో ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇటీవలె వరలక్ష్మి శరత్ కుమార్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పుడు తాజాగా మరొక హీరోయిన్ సునయన కూడా త్వరలోనే వివాహం చేసుకోబోతోందని తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ తమిళంలోనే కాకుండా మలయాళం, తెలుగు వంటి చిత్రాలలో కూడా నటించింది. అనేక భారీ విజయాలను కూడా అందుకున్నది.ఈ మధ్యకాలంలో సునయన వివాహం చేసుకోబోతోందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ముఖ్యంగా ఇమే ప్రముఖ దుబాయ్ కి చెందిన ఒక యూట్యూబర్ ఖలీద్ అల్ అమెరితో నిశ్చితార్థం కూడా అయిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు అయితే తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే దుబాయ్ కి చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయర్ తో నిన్నటి రోజున చేసుకున్నట్లు అధికారికంగా తెలియజేసింది. జూన్ 5న సునయన రెండు చేతులు ఒకరినొకరు పట్టుకొని ఉన్నటువంటి ఒక ఫోటోని సైతం షేర్ చేయడంతో అభిమానుల సైతం ఈ విషయాన్ని వైరల్ గా చేశారు. కానీ సునయన మాత్రం తన కాబోయే భర్త గురించి ఎవరైనా విషయాన్ని మాత్రం తెలపలేదు. అయితే ఈ పోస్టును ఖలీల్ కూడా లైక్ చేయడంతో ఈ విషయానికి మరింత బలాన్ని చేకూర్చింది.

జూన్ 26వ తేదీన ఖలీదు డైమండ్ రింగు తొడిగిన ఒక అమ్మాయి చేయి పట్టుకుని ఉన్నటువంటి ఫోటోని సైతం షేర్ చేశారు..దీంతో వీరి వివాహం జరగబోతున్నట్లు అధికారికంగా స్పష్టం అయ్యిందని కూడా అభిమానులు సైతం భావిస్తున్నారు. దీంతో ఈ జంటకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. ఖలీద్ విషయానికి వస్తే.. ఆయన ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఎన్నో వినోదాత్మకమైన వీడియోలను సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఈ మధ్యనే ప్రముఖ నటుడు అయినా మమ్ముట్టితో కలిసి చేసిన ఒక ఇంటర్వ్యూ ద్వారా మరింత పాపులారిటీ సైతం సంపాదించుకున్నారు. మరి సునయన పెళ్లి పైన అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: