కల్కి 2898AD: కల్కి రికార్డుని ఈ సినిమాలు బ్రేక్ చేస్తాయా..?

Divya
ఈనెల 27వ తేదీన ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసింది. కల్కి సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ జోరు టాలీవుడ్ ని కంటిన్యూ చేసేలా కనిపిస్తోందని ఈ భారం అంతా కూడా దర్శకుల మీద పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ , అల్లు అర్జున్ వంటి స్టార్స్ కూడా సినిమాలు చేస్తున్న తరుణంలో కల్కి రేంజ్ సక్సెస్ ఇస్తాయా అని అనుమానం కూడా మొదలవుతోంది.

జూలై నెలలో భారతీయుడు-2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. అయితే రీసెంట్గా విడుదలైన ట్రైలర్ పెద్దగా ఆకట్టుకోలేకపోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇండియన్-2 సినిమాతో మిస్ అయిన శంకర్ ఈ ఏడాది రామ్ చరణ్ తో కలిసి గేమ్ చేంజెర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చేలా ప్లాన్ చేశారు. ఇది కూడా భారీ బడ్జెట్ సినిమా కావడం గమనార్హం. మరి భార్య రికార్డులను టార్గెట్ చేస్తూ ఈ రెండు చిత్రాలు బరిలోకి దిగబోతున్నాయి.

డైరెక్టర్ కొరటాల శివ, దేవర సినిమాని తేరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోగా ఎన్టీఆర్ నటిస్తూ ఉండగా.. హీరోయిన్ల బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు గత రికార్డులను సైతం దేవర తిరగరాస్తుందనే విధంగా తెలియజేస్తున్నారు. ఈ సినిమా 27-9-24 విడుదల కాబోతోంది. టాలీవుడ్ లో మోస్ట్ అవైడడ్ చిత్రంగా పేర్కొంది పుష్ప-2 ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించారు. ఆల్రెడీ పుష్ప సినిమాతో సరికొత్త రికార్డులను తిరగ రాసిన అల్లు అర్జున్ మరి పుష్ప-2 చిత్రంతో ఎలాంటి రికార్డులు తిరగ రాస్తారు అనే విషయం ఇప్పుడు సుకుమార్ మీద ఆధారపడినట్లు తెలుస్తోంది. కల్కి చిత్రాల రికార్డులను విచిత్రాలు తిరగ రాస్తాయో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: