సూపర్‌మేన్ వయస్సు అడగకూడదు: కమల్ హాసన్
ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. తాజాగా పింక్‌విల్లాతో ఇంటరాక్టివ్ మాస్టర్‌క్లాస్ సెషన్ లో ఒక ప్రశ్నకు కమల్ గమ్మత్తైన సమాధానం చెప్పి అందరినీ నవ్వించారు. విషయం ఏమిటంటే... ఇండియన్-2లో సేనాపతి అసలు వయస్సు ఎంత? అనేదాని గురించి ఆయనిని ప్రశ్నించగా `సూపర్‌మ్యాన్ లేదా హనుమాన్ వంటివారికి వయస్సు ఎంత అని అడిగితే ఏమని చెబుతారు?` అని అన్నారు. దాంతో అందరూ చెప్పలేమన్నట్టు నవ్వేశారు. ఇకపోతే ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాని సుభాస్కరన్ అల్లిరాజా సారథ్యంలోని లైకా ప్రొడక్షన్స్ బేనర్ అన్ని భాషల్లో విడుదల చేస్తోంది. కాగా ఈ చిత్రం దేశమంతటా తమిళం, తెలుగు, హిందీ భాషలలో 12 జూలై 2024న థియేటర్లలో విడుదల కానుంది.
ఇకపోతే ఈ ఇంటర్వ్యూ ముగింపులో కమల్ వాడిన డైలాగ్ ఇపుడు అభిమానులు షేర్ చేస్తున్నారు. "అతను ప్రతిచోటా ఉంటాడు.. యుగాలు దాటి వస్తాడు.. అందుకే మీరు అతన్ని దేవుడివలె ఎక్కువ కాలం జీవించేవాడిగా చూస్తారు!" అని చెబుతూ ఇంటర్వ్యూ ముగించారు. ఇక ఇండియన్-2 1996లో విడుదలైన భారతీయుడు చిత్రానికి కొనసాగింపు లేదా డిఫరెంట్ కాన్సెప్ట్ అని అనుకోవచ్చు. ఈ సినిమాలో అప్పుడు కమల్ హాసన్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయడం జరిగింది. తండ్రి తన దేశంలో అవినీతిని ఎదిరించేవాడిగా విప్లవకారుడిగా కనిపించాడు. ఇండియన్ 2 దానికి మునుపు ఏం జరిగిందనేది తెరపై ఆవిష్కరిస్తుంది. ఇది ప్రీక్వెల్ కథతో రూపొందిన ఆశ్చర్య పడనక్కర్లేదు. ఈ సినిమాలో కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య, బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్ తదితరులు నటించారు.