మెగా అభిమానులకి గుడ్ న్యూస్.. చరణ్ గేమ్ చేంజర్ నుండి అదిరిపోయే అప్డేట్..!?

Anilkumar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.   త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్న తర్వాత రామ్ చరణ్ చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందులో భాగంగానే దీనికి సంబంధించిన అన్ని పనులను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్. అయితే శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ 
 సినిమాతో మరోసారి ఆయన మార్క్ చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాగా ఈ సినిమా కంటే ముందు ఇండియన్ 2 అనే సినిమాతో

 ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు డైరెక్టర్ శంకర్. అయితే ఇప్పుడు గేమ్ చెంజర్ కంటే ముందు ఇండియన్ టు సినిమా వస్తే దీని ప్రభావం కచ్చితంగా చరణ్ సినిమాపై ఉంటుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగా అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకపక్క స్టార్ హీరోలు అందరూ తమ తమ సినిమాలను రిలీజ్ చేస్తూ బిజీగా ఉన్నారు కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  

 సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ క్లారిటీ మాత్రం రాలేదు. అయితే  తెలుస్తున్న సమాచారం ప్రకారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  గేమ్ చేంజర్ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. దీవాళికి రిలీజ్ కన్ఫర్మ్ అయితే అనౌన్స్ చేసేయొచ్చు కదా అనుకోవచ్చు.. సినిమా దాదాపు పూర్తి కావొచ్చినా ఎక్కడ ఏమాత్రం డౌట్ కొట్టినా సినిమా రిలీజ్ వాయిదా వేయాలని అనుకుంటున్నారు. అందుకే గేమ్ చేంజర్ రిలీజ్ విషయంపై దర్శక నిర్మాతలు క్లారిటీ ఇవ్వట్లేదు. ఇండియన్ 2 ఇంటర్వ్యూలో డైరెక్టర్ శంకర్ కూడా గేమ్ చేంజర్ రిలీజ్ పై క్లారిటీ ఇవ్వలేకపోయారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: