'డబుల్ ఇస్మార్ట్' మాస్ సాంగ్ వచ్చేస్తుంది.. ఫస్ట్ సింగిల్ అప్డేట్ వైరల్..

murali krishna
ఉస్తాద్ రామ్ పోతినేని, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాద్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ”డబుల్ ఇస్మార్ట్ “.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా రాబోతుంది.దర్శకుడు పూరీ జగన్నాద్ ఇస్మార్ట్ శంకర్ మూవీ తరువాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా తెరకెక్కించాడు.. ఈ సినిమాను పూరీ జగన్నాద్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది..ఈ సినిమాతో దర్శకుడు పూరీ జగన్నాద్ ను  స్టార్స్ పట్టించుకోవడం మానేశారు. దీనితో ఈ దర్శకుడికి అస్సలు ఆఫర్స్ రాలేదు. లైగర్ రిలీజ్ కు ముందు దర్శకుడు పూరీ జగన్నాద్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో “జనగణమన” సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమా పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్.. కానీ లైగర్ సినిమా డిజాస్టర్ తో ఈ సినిమా నిర్మాతలు చేతులెత్తేశారు. దీనితో జనగణమన ఆగిపోయింది. దీనితో పూరీ ఏడాది పాటు ఆఫర్స్ కోసం ఎదురుచూశారు.

ఎట్టకేలకు ఎనర్జెటిక్ స్టార్ రామ్పూరీతో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. అది కూడా ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాను దర్శకుడు పూరీ ఛార్మి కౌర్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.. ఈ సినిమాకు మరోసారి మాస్ బీట్స్ ఇచ్చేందుకు మణి శర్మ సిద్ధం అయ్యారు. ఈ సినిమా మ్యూజిక్ జాతర మొదలైంది. జులై 1 న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మాస్ సాంగ్ ప్రోమోను మేకర్స్ రేపు ఉదయం 11.02 గంటలకు విడుదల చేయనున్నారు.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: